ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో అభివృద్ధి దిశగా పురుషోత్తమపట్టణము
ఈనాడు ప్రపంచం మొత్తం మనిషి గుప్పిటలో నిక్షిప్తమైవున్నది. కంప్యూటర్ పరిజ్ఞానాన్ని ఆధునిక మానవుడు అందిపుచ్చుకొని ఆంతర్జాలం ( ఇంటర్నెట్ ) సహాయంతో అద్భుతాలను ఆవిష్కరిస్తున్నాడు. ఈ పరిస్థితిని పురుషోత్తమపట్టణానికి చెందిన యువకులు గ్రామాభివృద్ధికి వినియోగించుచున్నారు. గ్రామంలోని విద్యావంతులైన యువకులనెందరికో జీవనభృతిని కల్పిస్తూ చరిత్ర పుటలలో శాశ్వతంగా నిలిచిపోయే విధముగా కార్యాచరణను అమలుచేస్తున్నారు.
ఈ విధమైన ఆధునిక దృక్పధంతో తోలి అడుగులు వేసిన వ్యక్తి కీర్తిశేషులు బైరా ప్రసాదరావు గారి జ్యేష్ఠ పుత్రుడు శ్రీ బైరా శ్యాంసుందర్. అమెరికాలో ” వెన్ సాఫ్ట్ ” ( Vensoft “) పేరుతో సాఫ్టువేర్ కంపెనీని స్థాపించి ఆ రంగంలో ఎందరికో మార్గదర్శకుడిగా నిలిచారు. ఎందరో విద్యావంతులకు అమెరికాలో స్థిరపడే అవకాశాన్ని కల్పించారు. శ్రీ బైరా ప్రసాదరావు గారి జ్ఞాపకార్థం ఓ వైద్యాలయాన్ని స్థాపించి పురుషోత్తమపట్టణములోని ప్రజలకు ఉచితముగా వైద్య సేవలందిస్తున్నారు.
శ్రీ విడదల లక్ష్మేనారాయణ గారి ప్రధమ పుతృడు విడదల కుమారస్వామి సాఫ్ట్ వేర్ పరిశ్రమలో చాలా వేగంగా దూసుకెళ్లాడు. అతని అడుగులు అమెరికా దేశాన్ని దాటి కెనడా, జర్మనీ, ఇండియాలను గూడా తాకాయి. ” ప్రాసెస్ వీవర్ ” ( ProcessWeaver) ” పేరుతో సాఫ్ట్ వేర్ కంపెనీని ” అమెరికా” లొ స్థాపించి పైన తెలియజేసిన దేశాలకు అతని సాఫ్ట్ వేర్ సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు. అంతేకాదు, భారత్ లో హైదరాబాద్, గుంటూరు నగరాలలో కంపెనీ శాఖలను ( Branches ) ను ఏర్పాటు చేశాడు.
మనుషులు నగరాలలో స్థిరపడిన తర్వాత, పుట్టి పెరిగిన గ్రామాన్ని మరిచిపోవడం సహజనైజం. కానీ కుమారస్వామిలో ఓ ప్రత్యేకత వుంది. పురుషోత్తమపట్టణము గ్రామాన్ని తన కేంద్ర కార్యాలయముగా చేసుకున్నాడు. అమెరికా నుండి తరచు భారతదేశానికి రావడం, ఇక్కడి కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించడం అలవాటు చేసుకున్నాడు.
అంతేగాదు గ్రామానికి చెందిన ఎందరో యువకులకు తన సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగావకాశాలు కల్పించి వారికి జీవన మార్గాన్ని ఏర్పరిచినాడు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన యువతీ యువకులకు సాఫ్టు వేర్ రంగంలో మార్గనిర్దేశనం చేస్తున్నాడు.
ప్రపంచాన్ని శాసించగలిన సాంకేతిక పరిజ్ఞానం ఈ గ్రామానికి చెందిన యువకులలో వున్నది. డాక్టర్ శ్రీ తోట గుండయ్య గారి ప్రధమ పుత్రిక, విడదల హనుమంతురావు నాయుడు గారి భార్య శ్రీమతి అరుణకుమారి గురించిన వివారాలు తెలియజేయవలసిన అవసరం ఎంతయినా వుంది. గ్రామంలో ప్రాధమిక విద్యనభ్యసించిన అరుణ కుమారి వరంగల్లు రీజినల్ ఇంజినీరింగ్ కాలేజిలో సీటు సాధించారు. ఆ తరువాత ఐ.ఐ.టి. మద్రాసులో ఉన్నత విద్యనభ్యసించారు. కేవలం తన మేధస్సుతో ఆమె గ్రామస్థాయి నుండి ఉన్నత విద్యాలయలలో విద్యనభ్యసించే స్థాయికి ఎదగడం ఇప్పటికే ” ఆల్ టైం రికార్డు ” గా ప్రముఖులు ప్రశంసిస్తూ వుంటారు.
బైరా శ్యాంసుందర్, విడదల కుమారస్వామి నడిచిన దారిలో విడదల అరుణకుమారి గూడా నడిచారు.
” ఆక్వా క్లౌడ్ ” (Aqua Cloud”) పేరుతో సాఫ్ట్ వేర్ కంపెనీ స్థాపించారు. బ్రిటన్ కేంద్రంగా హైదరాబాద్ లో గూడా కంపెనీ స్థాపించబడినది. గ్రామానికి చెందిన ఎందరో చెందిన ఎందరో నిరుద్యోగ యువకులకు శ్రీమతి అరుణ కుమారి ఉద్యోగావకాశాలు కల్పించారు.
ఈ రచయిత పరిశోధనలో ఆంద్రప్రదేశ్ లో మూడు పురుషోత్తమపట్టణములు గుర్తించబడినవి. ఒకటి గుంటూరు జిల్లాలో వున్న ఈ గ్రంధం ఆవిర్భావానికి కారణమైన పురుషోత్తమపట్టణము ( చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో వున్నది ), రెంవది-కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో వున్న పురుషోత్తమపట్టణము, మూడవది-పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం సమీపమున వున్న పురుషోత్తమపట్టణము.
కానీ, చారిత్రక ప్రసిద్ధి కలిగివున్న ఏకైక గ్రామము గుంటూరు జిల్లాలోని ఈ పురుషోత్తమపట్టణము మాత్రమే అని చెప్పుటలో ఎలాంటి సందేహంలేదు.