Municipality

  1. పురుషోత్తమపట్నం నుంచి చిలకలూరిపేట గా పేరు మార్పు చేసి, చిలకలూరిపేట పంచాయితీ హోదా నుంచి 1964 జనవరి 30 మూడవ స్థాయి పురపాలక సంఘ హోదా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
  2. మొదటిసారి 1967 సంవత్సరంలో పురపాలక సంఘం ఎన్నికలు నిర్వహించారు.
  3. 1980 ఏప్రిల్  28 3 స్థాయి నుంచి రెండొవ స్థాయి పురపాలక సంఘముగా పదోన్నతి పొందింది.
  4. 2001 మే 18 రెండవ స్థాయి నుంచి మొదటి స్థాయి పురపాలక సంఘo గా అవతరించింది.

పురపాలకుల వివరాలు

  1. 1964లో మున్సిపాలిటీ గా ఆవిర్భవించిన చిలకలూరిపేటకు 1967 లో తొలిసారి పురపాలక ఎన్నికలు జరిగాయి. తొలి చైర్మన్ గా శ్రీకృష్ణ వెంకటేశ్వర్లు గారు ఎన్నికయ్యారు. పదవిలో కొనసాగుతూనే మృతి చెందడంతో ఆయన స్థానంలో బచ్చు రామలింగం గారు చైర్మన్ అయ్యారు.
  2. 1973 నుంచి 1981 వరకు స్పెషల్ ఆఫీసర్ పరిపాలన సాగింది.
  3. 1981 లో ఎన్నికలు నిర్వహించగా BCH స్వామి నాయక్ గారు చైర్మన్ గా ఎన్నికయ్యారు. నాలుగు సంవత్సరాలు పైబడి పదవి నిర్వహించాక APPSC గ్రూప్ సెలక్షన్ కావడంతో పదవికి రాజీనామ చేసి ఉద్యోగానికి వెళ్లారు. ఆయన స్థానంలో ఉసర్తి నాగయ్య చైర్మన్ పదవి అలంకరించారు. కొన్నాళ్ళు స్పెషల్ ఆఫీసర్ పరిపాలన సాగింది.
  4. 1987 నుంచి 1992 వరకు మాజేటి వెంకటేశ్వర్లు గారుచైర్మన్ గా పనిచేశారు. తరువాత కొంత కాలం స్పెషల్ ఆఫీసర్ పరిపాలన సాగింది.
  5. 1995 నుంచి 2000 వరకు తవ్వా విజయలక్ష్మీ గారు తొలి మహిళా చైర్ పర్సన్ పని చేశారు.
  6. 2000 నుంచి 2005 వరకు బింగి రామూర్తి గారు చైర్మన్ గా పని చేశారు.
  7. 2005 నుంచి 2010 సెప్టెంబర్ వరకు జరపల కోటేశ్వరి చైర్ పర్సన్ గా వ్యవహరించారు.
  8. 2014 నుంచి 2019 వరకు గంజి చెంచు కుమారి చైర్ పర్సన్ గా కొనసాగారు.

త్రాగు నీరు

  1. 1970 సంవత్సరంలో మొట్ట మొదటి సారి 950 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో 70 ఎకరాలలో పురుషోత్తమపట్నంలో మంచినీటి చెరువును నిర్మించారు. దీనిలో బాగంగా మంచినీటి శుద్ధి కేంద్రము మరియు నీటి సరఫరా కేంద్రం పండరీపురంలో నిర్మించారు.
  2. 2001 వ సంవత్సరంలో రెండొవ వేసవి మంచినీటి చెరువును 2,690 మిలియన్ లీటర్ల సామర్థ్యం తో పురుషోత్తమపట్నంలో వున్న శ్రీ వేణుగోపినాధ స్వామి గుడికి సంబందించిన 122 ఏకరాలలో  మాజీ శాసనసభ్యుడు శ్రీ సోమేపల్లి సాంబయ్య గారు నిర్మించారు. ఈ నిర్మాణంలో భాగంగా మంచినీటి శుద్ధి కర్మాగారాన్ని పండరీపురంలో నిర్మించారు.
  3. 36 సంవత్సరాల క్రితం 87 కిలోమీటర్ల పొడవునా మంచినీటి సరఫరా పైపు లైన్ నిర్మించినారు. తరువాత కాలంలో ఎలాంటి చిన్న చిన్న రిపేర్లు  తప్పా ఎలాంటి పెద్ద మార్పులు చేయలేదు.
  4. 2015 మే నెల లెక్కల ప్రకారం 10,873  వ్యక్తిగత మంచి నీటి కనెక్షన్లు  ,  618 మంచినీటి వీధి కనెక్షన్లు  మరియు 516 బోర్ బావులు ఉన్నాయి
  5. చిలకలూరిపేట 10ఆర్ మేజర్ నుంచి పట్టణ మంచినీటి చెరువుకు కాల్వ ద్వారా  సాగర్ జలాలు నింపుతారు.