9. వృత్తులు

వృత్తులు

ఈ గ్రామంలో ఎక్కువ శాతం మంది మధ్యతరగతి రైతులు వ్యవసాయం ఆధారంగా పొగాకు, ప్రత్తి, మిరప, కంది, జొన్న మొ||పంటలు పండించేవారు. భూములు లేని కుటుంబాలు ఇటుక బట్టీల వ్యాపారాన్ని వృత్తిగా చేసుకున్నారు. 2000 సంవత్సరములు వరకు గుంటూరు, ప్రకాశం జిల్లాలకు గృహనిర్మాణాల నిమిత్తం ఇటుకలను సరఫరా చేసే ముఖ్యమైన గ్రామముగా పురుషోత్తమపట్టణము గుర్తింపు పొందినది.