1940లో మైలవరపు గుండయ్య శ్రేష్టి కార్యదర్శిగా రచుమల్లు వరలక్ష్మమ్మ శ్రీ చిలకలూరిపేట విద్యా సంఘోన్నత పాఠశాల ను ప్రారంభించారు.
1947-48 మార్చిలో ఎస్ ఎస్ ఎల్ సి పబ్లిక్ పరీక్షలకు తొలి బ్యాచ్ విద్యార్థులు హాజరయ్యారు. దిన దిన ప్రవర్ధమానమవుతూ 23 తరగతి గదులూ, రెండు లేబొరేటరీలు, ఒక క్రాఫ్ట్ గది, సమావేశ మందిరం, విశాల క్రీడా ప్రాంగణం, త్రాగునీటి కోసం అధునాతన ఆర్వో వాటర్ ప్లాంట్ వంటి సౌకర్యాలతో అభివృద్ధి చెందింది.