ఈనాడు పురుషోత్తమపట్టణము గ్రామము పాడిపంటలతో గలిగివున్న నాయకులతో విరాజిల్లుతున్నది. దాదాపు 200కు పైగా విద్యాధికులైన యువకులు దేశంలోని విభిన్న ప్రాంతాలలో, విదేశాలలో ఉన్నతోద్యోగములలో స్థిరపడినారు. వారి కుటుంబాలకే గాకా గ్రామానికి సైతం వారు సేవలందింస్తున్నారు.
గ్రామంలో కల్యాణమండపం లేని లోటును విడదల లక్ష్మీనారాయణ గారు తన అమ్మా, నాన్న గారి పేరుతో ” విడదల సంజీవరాయుడు అచ్చమ్మ కళ్యాణమంటపం ” నిర్మించడం ద్వారా తీర్చినాడు. ఈ విధంగా పుట్టిన గడ్డ యెడల తన కృతజ్ఞతాభావమును వ్యక్తం చేయుచున్నాడు.