కందుల కొనుగోలు కార్యక్రమం

చిలకలూరిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ విడదల లక్ష్మీనారాయణ ఈ రోజు మార్కెఫెడ్ అద్వర్యంలో కందుల కొనుగోలు కార్యక్రమాన్ని పరిశీలించి రైతులకు మేలు జరిగే విధంగా సహకరించాలని అధికారులకు సూచించారు.
అక్కడ వున్న రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని, అధికారులకు పరిష్కర మార్గాలను సూచించారు.

మొదలయిన బైపాస్‌ సర్వే

బహిరంగ మార్కెట్‌ కన్నా మంచి ధర ఇస్తే బైపాస్‌ రహదారికి తన భూములు ఇస్తానని బొప్పూడి సర్పంచి పూసల హరిబాబు స్పష్టం చేశారు. రైతుల భూములు ఒక్కోచోట ఒక్కో విధంగా ధరలు ఉన్నాయన్నారు. వాటన్నింటిని పరిగణలోకి తీసుకొని అధిక ధర అందజేస్తే రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధమేనన్నారు.

హర హారో చేదుకో కోటయ్య …

ఈ రాత్రి జగత్తు అంతటికీ ఆరాధ్య వేళ. పుణ్యాల పంట. అంతులేని సిరుల మూట.ఉపాసనలకు నెలవు. పూజలకు కొలువు.

  1. మధ్యాహ్నం నుంచి భక్తులు పెరగడంతో కోటప్పకొండలో నాలుగు రహదారుల కూడలి కిటకిటలాడింది.
  2. సాయంత్రం 5గంటల సమయంలో మెట్ల దారి రద్దీగా మారింది.
  3. ప్రసాదాల కౌంటర్లు ఉదయం నుంచి రద్దీగా ఉన్నాయి. సాయంత్రం ఆరు గంటలకు లక్షా 30 వేల లడ్డూలు భక్తులు కొనుగోలు చేశారు. అదేవిధంగా 40 వేల అరిసెలు కొనుగోలు చేశారు.
  4. రాత్రి వేళ ఆలయం, ప్రభలు దేదేప్యమానంగా వెలుగొందాయి.
  5. పురుషోత్తమపట్నం గ్రామం నుంచి వచ్చిన ఆరు విద్యుత్ ప్రభలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు సేవలందించేందుకు పలు సంస్థలు పోటీ పడ్డాయి.

  1. జేఎన్‌టీయూ కళాశాల విద్యార్థులు 50 మంది ఉదయం నుంచి క్యూలైన్లలో భక్తులకు మంచినీరు అందజేశారు.
  2. అలాగే స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ 125 మంది కొండ వద్ద సేవలందించారు.
  3. ఫ్రెండ్లీ పోలీసు పేరుతో పోలీసు సేవాదళ్‌ సభ్యులు వికలాంగులకు, అంధులకు, వృద్ధులకు సేవలందించారు.

45 ఏళ్లుగా హాజరవుతున్నా: సభాపతి కోడెల 
మేథా దక్షిణామూర్తి త్రికోటేశ్వరుని రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. భక్తజనాన్ని ఆశీర్వదిస్తున్నారు. చేదుకో కోటయ్య.. ఆదుకో కోటయ్య అంటూ భక్తజనులు పిలిస్తే పలికే దైవం ఆయన. 45 ఏళ్లుగా కోటప్పకొండకు హాజరవుతున్నా. మెట్ల మార్గంలో వచ్చి దర్శించుకున్నా. ఘాట్‌రోడ్డులో వచ్చి దర్శించుకుంటున్నా. స్వామివారికి సేవ చేసే అదృష్టం దక్కింది. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయగలిగాం. పర్యావరణ పర్యాటక క్షేత్రం కూడా ఏర్పాటు చేశాం. అతి పెద్ద పుణ్యక్షేత్రంగా భవిష్యత్తులో మారుతుంది.

కోడెల సారథ్యంలో కొటప్పకొండ అభివృద్ధి: పుల్లారావు

ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ సారథ్యంలో కొటప్పకొండ పూర్తిగా అభివృద్ధి చెందిందని మంత్రి పుల్లారావు అన్నారు. శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ నా చిన్నప్పటి నుంచి కొటప్పకొండకు ప్రభలతో వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నామని, రాష్ట్రాభివృద్ధికి స్వామి వారి ఆశీస్సులు కోరామని మంత్రి పుల్లారావు పేర్కొన్నారు.

త్రికోటేశ్వరుని ఈ రోజు దర్శనము

ఈరోజు తెల్లవారుజామున ఒంటి గంటకు బిందె తీర్ధంతో మహాశివరాత్రి వేడుక ప్రారంభం అయ్యింది. అభిషేకం అనంతరం స్వామికి అలంకరణ చేశారు. రెండు గంటల నుంచి దర్శనానికి భక్తులను అనుమతించారు.

24-02-2017-1