2 ఆరోగ్య కేంద్రాల్లో అధునాతన వైద్యం

రోగులకు కార్పొరేట్‌ సేవలు

ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో అధునాతన వైద్యం, వినియోగించు కోవడంలో ప్రజల్లో కొరవడిన అవగాహన

  1. సర్కారు వైద్యశాలల్లో సరైన వైద్యసేవలు అందవనే భావన ప్రజల్లో నెలకొంది. అయితే పేదలకు కార్పొరేట్‌స్థాయి వైద్యం అందించే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
  2. ఇటీవల పట్టణాల్లో అర్బన్‌ హెల్త్‌ సెంటర్లను ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలుగా మార్చింది. అలాగే అక్కడ అధునాతన హంగులు, పరికరాలు సమకూర్చుతోంది.
  3. సుమారు 27 వ్యాధులకు సంబంధించి వైద్య పరీక్షలు, మందులను అందుబాటులోకి తెచ్చింది. అయితే ముఖ్యమంత్రి ఆరోగ్యకేంద్రాల్లో అందుతున్న వైద్యసేవల గురించి ప్రజల్లో అవగాహన లేకపోవడంతో ఆయా వైద్యశాలలకు రోగుల సంఖ్య పెరగడం లేదు.
  4. ప్రభుత్వ వైద్యశాలలో అందుతున్న వైద్య సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
  5. ప్రతి కేంద్రంలో మూడు కంప్యూటర్లు ఏర్పాటు చేశారు. అందులో ఒకటి వైద్యుని వద్ద, మిగతావి ఆన్‌లైన్‌లో రోగి వివరాలు నమోదు చేయడానికి ఉపయోగిస్తున్నారు.
  6. ల్యాబ్‌ వంటి సౌకర్యాలు కల్పించారు.

బొప్పూడి-కోటవారిపాలెం రహదారి విస్తరణ

బొప్పూడి నుంచి కోటవారిపాలెం వరకు ఉన్న 4 కి.మీ. ఆర్‌అండ్‌బీ రహదారి విస్తరణ పనులను రాష్ట్ర పౌరసరఫరాశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శుక్రవారం ప్రారంభించారు. రూ.1.04 కోట్లతో ఈ పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు. త్వరితగతిన పూర్తి చేయాలని గుత్తేదారులను ఆదేశించారు. సర్పంచి హరిబాబు, ఎంపీటీసీ సభ్యుడు మస్తాన్‌, యార్డు అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, పురపాలిక అధ్యక్షురాలు చెంచుకుమారి, ఉపాధ్యక్షుడు అప్పారావు, తెదేపా నియోజకవర్గ సమన్వయకర్త సదాశివరావు, ఆర్‌అండ్‌బీ ఈఈ రాఘవేంద్రరావు, తెదేపా నాయకులు మదన్‌, సోంబాబు పాల్గొన్నారు.

నకిలీ విత్తనాల పై సమాచారం ఇవ్వండి

ఎండనక… వాననక కల్లంలో తన జీవితాన్ని త్యాగం చేసే రైతన్నకు నకిలీ విత్తనాల బెడద ప్రతిసారీ ఎదురవుతోంది.

ఎవరికైనా ఎక్కడైనా అనుమతులు లేని, నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు విక్రయాలు చేస్తున్నా, అక్రమ నిల్వలు చేసినా ఆ సమాచారాన్ని విజిలెన్స్‌ ఎస్పీ సెల్‌ నెంబర్‌ 80082 03288, విజిలెన్స్‌ వ్యవసాయ అధికారి వెంకట్రావు సెల్‌ నెంబర్‌ 80082 03295కు చెప్పండి.

పోలీస్‌ కంప్లైంట్స్‌ అథారిటీ (పీసీఏ)

సామాజిక భద్రతా సాధనంగా ప్రజల తలలో నాలుకలా విధులు నిర్వర్తించాల్సిన పోలీసులు తమకు తామే చట్టమన్నట్లుగా వ్యవహరిస్తూ అసాంఘిక శక్తులతో చేతులు కలిపి ఘోర నేరాలకూ పాల్పడుతున్నారన్నది నిష్ఠుర సత్యం.

పోలీసులపై ప్రజలు చేసే ఫిర్యాదుల్ని పరిష్కరించేందుకు పోలీస్‌ కంప్లైంట్స్‌ అథారిటీ (పీసీఏ)ని మూడు నెలల్లోగా ఏర్పాటు చెయ్యాలన్నది, ఉభయ తెలుగు రాష్ట్రాల హోంమంత్రిత్వశాఖలకు ఉన్నత న్యాయస్థానం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.