రాజకీయ ప్రముఖులు
భారతదేశమునకు స్వాతంత్ర్యం రాక ముందు, వచ్చిన తరువాత చిలకలూరిపేట నియోజకవర్గమును శాసించిన రాజకీయ ప్రముఖులు పుఉషోత్తమపట్టణము గ్రామములో జన్మించినవారే కావడం ఈ ప్రాంతంలో ప్రత్యేకతను సంతరించుకున్నది. దేశ స్వాతంత్ర్య సముపార్జన కోసం పూజ్య బాపూజీ అడుగుజాడలలో నడిచి పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు స్వర్గీయ బత్తినేని కోటి శంకరనారాయణగారు పురుషోత్తమపట్టణంలో జన్మిచినవారే కావడం ఈ గడ్డ చేసుకున్న సుకృతమని గ్రామ ప్రజలు భావిస్తున్నారు. బ్రిటీష్ వారి హయాంలో పంచాయితీ తొలి అధ్యక్షునిగా తోట శీనయ్య నాయుడు గారు పరిపాలన కొనసాగించినారు.
తోట భరతుడు
తోట శేషాద్రినాయుడు గురి తృతీయపుత్రుడు స్వర్గీయ తోట భరతుడు గారు ” పురుషోత్తమపట్నం శివారు చిలకలూరిపేట ” గ్రామమునకు దాదాపు 55 సం||లు మున్సబు ( గ్రామ పరిపాలనాధికారిగా ) గా వ్యవహరించినారు. మాజీ ముఖ్యమంత్రులు కాసు బ్రహ్మనందరెడ్డి, జలగం వెంగళరావులకు అత్యంత సన్నితుడిగా మెలిగినారు. మాచర్ల, గురజాల, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, వినుకొండ, నర్సరావుపేట, చిలకలూరిపేటల మార్కెట్ యార్డుల ఉమ్మడి స్వరూపమైన ” ది నర్సరావుపేట అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీకి ఓక పర్యాయము ( మూడు సంవత్సరములు ) చైర్మన్ గా పదవీ బాధ్యతలు నిర్వహించినారు. ఆ తదుపరి ” ది చిలకలూరిపేట అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీకి ఒక పర్యాయము ( మూడు సంవత్సరములు ) చైర్మన్ గా పదవీ భాద్యతలు నిర్వహించడం జరిగినది. గ్రామంలోని పలువురు నిరుద్యోగులకు ఉపాధి ( ఉద్యోగములు ) అవకాశము కల్పించినారు.
శ్రీ తోట పాంచజన్యం
శ్రీ తోట పాంచజన్యం 1982 వ సంవత్సరము సెప్టెంబర్ 8 వ తేదీన శాసన పరిషత్తు ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికై 1983 వ సంవత్సరము ఆగస్టు 8వ తేది వరకు ఆ పదవిలో కొనసాగారు.
శ్రీతోట పాంచజన్యం గారు 1933వ సంవత్సరములో జన్మించారు. గుంటూరు ఏ.సి.కళాశాల నుండి డిగ్రీ పూర్తి చేసిన తరువాత ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎల్.ఎల్.ఎమ్.పట్టా పొందారు.
వీరు 1966వ సంవత్సరము జులై 1వ తేది నుండి 1972వ సంవత్సరము జూన్ 30వ తేది వరకు 1972వ సంవత్సరం జులై 1వ తేదీ నుండి 1978వ సంవత్సరము జూన్ 30వ తేదీ వరకు హైదరాబాదు పట్టభద్రుల నియోజకవర్గం నుండి, 1978వ సంవత్సరము జులై 1వ తేది నుండి 1983వ సంవత్సరం ఆగస్టు 8వ తేదీ వరకు శాసనసభ నియోజకవర్గం నుండి శాసన పరిషత్తు సభ్యులుగా ఉన్నారు.
శ్రీపాంచజన్యం 1974-75 సంవత్సరాల మధ్యకాలంలో ఆంద్రప్రదేశ్ శాసన పరిషత్తు విప్ గా మరియు 1979వ సంవత్సరము జూన్ నుండి 1980వ సంవత్సరము ఫిబ్రవరి వరకు ప్రతిపక్షనేతగా పనిచేసారు.
వీరు 1967వ సంవత్సరములో తాత్కాలిక నియమావళి సమితి, 1976-77, 1977-78 సంవత్సరాల మధ్యకాలంలో గ్రంధాలయ సమితి సభ్యులుగా, 1980-81 సంవత్సరాల మధ్యకాలంలో ప్రభుత్వ హామీల సమితి అధ్యక్షులుగా, 1981-82 సంవత్సరాల మధ్యకాలంలో ప్రభుత్వ లెక్కల సమితి సభ్యులుగా పనిచేసారు.
వీరు 1976 ఆంద్రప్రదేశ్ విద్యా బిల్లు, 1981 ఆంద్రప్రదేశ్ లోకాయుక్త, ఉపలోకాయుక్త బిల్లు, 1982 ఆంద్రప్రదేశ్ పురపాలకా సంఘాల (సవరణ) బిల్లులపై ఏర్పాటు చేసిన సంయుక్త విశిష్ఠ సమితి సభ్యులుగా పనిచేసారు.
న్యూఢిల్లీలోని ఆంద్రప్రదేశ్ అతిధి గృహం పనితీరుపై ఏర్పాటు చేసిన శాసన మండలి సభాసంఘంలో సభ్యులుగా పనిచేశారు. శ్రీ పాంచజన్యం 1983వ సంవత్సరం ఆగస్టు 8వ తేదిన మరణించారు.
శ్రీగోవిందు దాసయ్య
గోవిందు వీరరాఘవులు గారి కుమారుడు స్వర్గీయ గోవిందు దాసయ్య గారు మాజీ ముఖ్యమంత్రి శ్రీ.శే.లు కాసుబ్రహ్మనందరెడ్డి గారికి ఆత్మీయ మిత్రులు, వారి సోదరులు మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కీ.శే.కాసువెంగళరెడ్డి గారికి అత్యంత ఆప్తులు.
“ది నర్సరావుపేట అగ్రికల్చరల్ మార్కెట్ కమిటి” కి శ్రీదాసయ్య గారు చైర్మన్ గా పదవీ బాధ్యలు నిర్వహించారు. అఖిల భారత పొగాకు సంస్థ (ALL INDIA TOBACCO BOARD) లో సభ్యునిగా పదివీ భాద్యతలు నిర్వహించారు. ఎందరో నిరుద్యోగాలకు ఉపాధి కల్పించి బ్రతుకు బాటచూపినారు. శ్రీ.శే.శ్రీదాసయ్యగారు, శ్రీభరతుడు గారు 1968లో జరిగిన తొలి పురపాలకసంఘాల ఎన్నికలలో మున్సిపల్ కౌన్సిలర్ గా కూడా గెలుపొంది ప్రజాసేవకు అంకితమయ్యారు.
ఆతదుపరి పురుషోత్తమపట్టణమునకు చెందిన స్వర్గీయ బైరా వెంకటరావు గారు ” ది చిలకలూరిపేట అగ్రికల్చరల్ మార్కెట్ కమిటి” కి చైర్మన్ గా తెలుగుదేశం ప్రభుత్వంలో నియమించబడినారు. అటుపిమ్మట శ్రీబత్తినేని శ్రీనివాసరావు గారు 2006-2009 సంవత్సర కాలంలో అదే మార్కెట్ కమిటీ చైర్మెన్ గా పదవీబాధ్యతలు నిర్వహించారు.
చిలకలూరిపేటలో నియోజకవర్గములో శాసనసభ్యుడు (M.L.A) తర్వాత ద్వితీయ హోదా కలిగియున్న పదవి మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ పదవి. కేవలం ఈ గ్రామం నుండే నలుగురు రాజకీయ నేతలు ఈ పదవిని పొందడం ద్వారా నియోజకవర్గంలో పురుషోత్తమపట్టణం యొక్క ప్రాముఖ్యత ప్రముఖంగా గుర్తించబడినది.
కొమరిపల్లిపాడు ప్రాధమిక సహకార పరపతి సంఘం వుపదక్షులుగా శ్రీ విడదల లక్ష్మీనారాయణ గారు మరియు శ్రీ తోట ( పప్పు ) నాగేశ్వరరావు గారు ఎన్నిక కాబడి 5 సంవత్సరములు ఆ పదివిలో కొనసాగినారు.
శ్రీ బైరా వెంకటరావు గారు 5 సంవత్సరములు డైరెక్టర్ గా కొనసాగినారు. కాపులను బి.సిలలో చేర్చాలని శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఆమరణ నిరాహార దీక్ష చేసిన సందర్భములో ఆ ఉద్యమానికి మద్దతుగా శ్రీ విడదల లక్ష్మీనారాయణ గారు సహకార పరపతి సంఘం ఉపాధ్యక్ష పదవికీ రాజీనామా చేయడం జరిగింది. ఈ గ్రామానికి చెందిన తోట శ్రీనివాసరావు (న్యాయవాది) మరియు అచ్చుకోల విజయభాస్కరరావులు చిలకలూరిపేట పట్టణ తెలుగుదేశ పార్టీకి అధ్యక్షులుగా వ్యవహరించినారు. ఈ గ్రామానికి చెందిన విడదల కమలేంద్ర చిలకలూరిపేట పట్టణ తెలుగు యువత అధ్యక్షునిగా మరియు యువత గుంటూరు జిల్లా కార్యదర్శిగా పదవులు నిర్వహించినారు. శ్రీ|| శే || లు తోట భరతుడు గారి ద్వితీయ కుమారుడు శ్రీతోట రాజేంద్రప్రసాద్ గారు దశాబ్దానికి పైగా చిలకలూరిపేట పట్టణానికి జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు నిర్వహించినారు.