తక్కువ ధరలకు జనరిక్ ఔషదాలు

పోలిరెడ్డి పాలెం సమీపంలోని గంగమ్మ గుడి సమీపంలో ప్రధానమంత్రి జన ఔషధ యోజన (P M J A Y) కింద అతి తక్కువ ఖరీదులో 50 నుంచి 90 శాతం రాయితీతో డయాబిటీస్, గుండెకు సంబందించిన, రక్తపోటు, గ్యాస్ట్రో, విటమిన్స్, యాంటీ బయోటిక్స్ ఇలా 500 పైగా మందులు అందుబాటులో ఉన్నాయి.

  1. ఒక కొత్త ఔషధాన్ని కనుగొన్న సంస్థకు దానిపై 15 నుంచి పాతికేళ్ల కాలానికి పేటెంట్ లభిస్తుంది.
  2. అప్పటి వరకూ దానికి ఒక బ్రాండ్ పేరు పెట్టి విక్రయించే అవకాశం ఆ సంస్థకే ఉంటుంది. పేటెంట్ గడువు తీరిపోయాక ఇతరులు అదే ఔషధాన్ని తయారు చేసి విక్రయిస్తే దాన్ని జనరిక్ మందుగా వ్యవహరిస్తారు.
  3. మనదేశంలో ఏ సంస్థ ఏ ఔషధాన్నైనా తయారు చేసి దానికో బ్రాండ్ పేరుపెట్టి విక్రయించవచ్చు.
  4. అందుకే జనరిక్ ఔషధాల కంటే బ్రాండెడ్ఔషధాలే ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి.

బ్రాండెడ్ ఔషధాలతో పోల్చితే కొన్ని జనరిక్ ఔషధాల ధరలు 80- 90 శాతం తక్కువగా ఉంటున్నాయి.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.