వాటర్‌ ప్లాంట్ల ఏర్పాటుకు నిధులివ్వరూ..!

చిలకలూరిపేట నియోజకవర్గంలో పసుమర్రు, కావూరు గ్రామాల వద్ద రెండు క్లస్టర్‌ బేస్డ్‌ వాటర్‌ ప్లాంట్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించాలని ఎంపీ రాయపాటి సాంబశివరావు ముఖ్యమంత్రి సాంబశివరావును కోరారు.

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాయపాటి తన పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.

రూ.5 కోట్ల వ్యయంతో రెండు క్లస్టర్‌ బేస్డ్‌ వాటర్‌ ప్లాంట్ల ఏర్పాటుకు రూపకల్పన చేశామన్నారు. ఈ ప్లాంట్‌ ఏర్పాటు వల్ల చిలకలూరిపేట పట్టణంతో పాటు చుట్టుపక్కల 17 గ్రామాల ప్రజలకు మంచినీటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. కార్యక్రమంలో జడ్‌.ఆర్‌.యు.సి సభ్యులు కనుమూరి బాజీ చౌదరి పాల్గొన్నారు.

Leave a Reply