నాటి డీలరే.. నేటి పౌరసరఫరాల శాఖ మంత్రి

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా వ్యవసాయ శాఖ నుంచి పౌరసరఫరాల శాఖకు మారిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఒకప్పుడు రేషన్‌ డీలర్‌గా పనిచేశారు. ప్రకాశం జిల్లా మార్టూరు మండలం బొబ్బేపల్లి గ్రామంలో జన్మించిన ఆయన డిగ్రీ అనంతరం వ్యవసాయంపై మక్కువతో ఇంటి వద్ద వ్యవసాయం చేసుకొంటుండగా రేషన్‌ దుకాణ డీలర్‌గా ఉండాలని గ్రామస్థులు పట్టుబట్టారు. దీంతో 1985లో బొబ్బేపల్లి డీలర్‌గా ప్రత్తిపాటి బాధ్యతలు చేపట్టారు. అప్పట్లోనే రేషన్‌ దుకాణం నిర్వహణలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని అధికారుల ప్రశంసలు అందుకొన్నారు. వ్యవసాయమంటే మక్కువ ఉండే ఆయన నవ్యాంధ్రప్రదేశ్‌లో తొలి వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేయడం.. గతంలో డీలర్‌గా పనిచేసి తాజాగా పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం విశేషం.

  1. చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన మంత్రి పత్తిపాటి పుల్లారావుకు శాఖల మార్పు జరిగింది.
  2. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదేళ్లు జిల్లా అధ్యక్షుడిగా పని  చేశారు. ఆయన సేవలను గుర్తించి అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి పదవితోపాటు కీలకమైన శాఖలను అప్పగించారు.
  3. కృష్ణా జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా కూడా ఉన్నారు.
  4. ప్రస్తుతం ఆయనకు పౌరసరఫరాలు అప్పగించారు. గతంలో దీన్ని పరిటాల సునీత నిర్వహించారు.
  5. మంత్రి పత్తిపాటి పుల్లారావు రైతాంగం కోసం నిరంతరం శ్రమించడమే కాకుండా.. వరుసగా నాలుగుసార్లు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత తొలిసారిగా పుల్లారావుకు దిక్కింది.
  6. నకిలీ విత్తనాలు అమ్మిన డీలర్లపై ఉక్కుపాదం మోపారు. గతంలో ఎన్నడూలేని విధంగా వారిని అరెస్టు కూడా చేయించారు.
  7. పౌరసరఫరాల శాఖకు జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉంది. గతంలో దీనిని జిల్లాకే చెందిన ప్రస్తుత సభాపతి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు, మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి నిర్వహించారు.

Leave a Reply