నవ్యాధ్రలో జరిగే అతిపెద్ద తిరునాళ్ల కోటప్పకొండ వేడుక

  1. నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ తదితర ప్రాంతాల నుంచి సుమారు 4 లక్షల మంది ప్రయాణికులు కోటప్పకొండ రావచ్చని అంచనా. దీనికోసం 401 బస్సులను ఏర్పాటు చేస్తున్నారు.
  2. కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా కొండ కిందభాగం నుంచి గుడివద్దకు ఘాట్‌మార్గంలో తిరుమల బస్సులతోపాటు సూపర్‌లగ్జరీ బస్సులు తిరగనున్నాయి.
    ఇందుకు గాను తిరుమల ఘాట్‌రోడ్డులో తిరిగే 50 బస్సులను ప్రత్యేకంగా తెప్పిస్తున్నారు.
  3. వీవీఐపీలకు ప్రత్యేకంగా 15 సూపర్‌లగ్జరీ బస్సులను ఏర్పాటుచేస్తున్నారు.
  4. 23న సాయంత్రం 6 గంటల నుంచి 25 మధ్యాహ్నం 2 గంటల వరకూ కోటప్పకొండ ఘాట్‌ మార్గంలో బస్సులు అందుబాటులో ఉండనున్నాయి.
  5. తిరునాళ్లకు రాకపోకలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ప్రయాణికులు గుంటూరు ఆర్టీసీ కంట్రోల్‌రూం 9959229869 నంబరుకు ఫోన్‌ చేయవచ్చు.

Leave a Reply