అలవాటు పడిన ప్రాణం కదా, అందులో కష్టపడకుండా రోజుకు కనీసం 5000 రూపాయలు ఎవరు వదులుకుంటారు?
నియోజకవర్గంలో బెల్టు షాపుల మీద ఎక్సయిజ్ పోలీసులు దాడులు నిర్వహిస్తుండటంతో ఇప్పుడు బెల్టు షాపు నిర్వాహకులు దగ్గరలో మోటార్ సైకిల్ లేదా స్కూటీ లాంటి బైకులతో స్టాక్ నిల్వ చేస్తున్నారు. ఈ బైకులు షాపుకు 100 మీటర్ల దూరంలో ఉంటాయి.
రిపబ్లిక్ డే రోజు పట్టణంలోని బెల్టు షాపులు ఒక్కొక్కటి కనీసం 25,000 రూపాయలు సంపాదించారని పట్టణంలోని మందుబాబులు గుస గుస లాడుకుంటున్నారు.
ఈ మహాశివరాత్రికి ఒక్కొక్క బెల్టు షాపు నిర్వాహకులు ఎన్ని లక్షలు సంపాదిస్తారో ఆ కోటయ్యస్వామికే ఎరుక ?