పురుషోత్తమపట్నం నుంచి 6 విద్యుత్ ప్రభలు

కోటప్పకొండకు వెళ్ళే యాత్రికులు మొదట పురుషోత్తమపట్నం సందర్శించి అక్కడ ప్రభలవద్ద టెంకాయ కొట్టి ఆ తరువాత కోటప్పకొండకు వెళ్లడం ఆనవాయితి.

కోటప్పకొండలో తిరుణాల మహాశివరాత్రి రోజు జరుపుకొంటే, పురుషోత్తమపట్నంలో మహాశివరాత్రి ప్రభల తిరుణాల వారంరోజుల ముందునుంచే జరుపుకొంటారు.

ఆకాశంలోని తారలు దిగివచ్చినట్టుగా మిరుమిట్లు  గొలిపే కాంతులతో పురుషోత్తమపట్నం ప్రభలు ఆకట్టుకొంటాయి.

పురుషోత్తమపట్నంలో పుల్లయ్యతాత ప్రభ చిత్రాలు.

  1. పురుషోత్తమపట్నం నుండి ఆరు అతి పెద్ద విద్యుత్ ప్రభలు మరియు మూడు చిన్న ప్రభలు ఈ నెల 24 న జరగనున్న మహా శివరాత్రికి మరొకసారి ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి.
  2. పురుషోత్తమపట్నం గ్రామ ప్రభతో పాటు తోట పుల్లప్ప తాత ప్రభ, విడదల వారి ప్రభ, బైరా వారి ప్రభ, తోట కృష్ణమ్మగారి ప్రభ, మండలనేని వారి ప్రభ, యాదవరాజుల ప్రభ, బ్రహ్మంగారి గుడి ప్రభ.
  3. ఒక్కొక్క ప్రభకు కనీసం 40 లక్షల రూపాయలు వ్యయం అవుతుంది.
  4. ఇప్పటికే సిద్ధంగా ఉంచుకున్న పొడుగు సరివి బారులను వరుసక్రమంలో తాళ్లతో ముడులు వేస్తూ కట్టేపనిలో నిమగ్నమయ్యారు.
  5. గ్రామాల్లో ప్రభల నిర్మాణ పనుల్లో ప్రజలు పాల్గొంటుండడంతో సందడి వాతావరణం నెలకొంది.

row-21-02-2017

తిరుణాలకు సిద్దమయిన ప్రభలు వరుసగా విడదల, పుల్లప్ప తాత, గ్రామ, బైరా వారి ప్రభ.

Leave a Reply