లోకల్ ఫుడ్ ఉద్యమం

ఇక నుంచి మనం కొనే కూరగాయలు, పాలు మన ప్రాంతంలోనే పండే వాటినే కొనుక్కుందాం.

ఇప్పటి నుంచి మనమందరం కిరాణా షాపు వాళ్ళు ప్రతి ప్యాకెట్ మీద ప్రతి ఉత్పత్తి మీద ఏ ఊరిలో పండిందో ముద్రించాలి అని అడుగుదాం.

ఈ క్రింద ప్రశ్నలకు సమాధానం మనకు దొరకకపోతే మనల్ని మనం ఆత్మహత్య చేసుకున్నట్టే :

  1. మనం తినే బియ్యం ఏ ఊరిలో పండించారు?
  2. మనం తినే కూరగాయలు ఎక్కడ నుంచి వచ్చినాయి?
  3. మనం త్రాగే పాలు ఏ రాష్ట్రము నుంచి వచ్చాయి?
  4. మనం తినే పప్పు దినుసులు ఏ ప్రాంతంనుంచి వచ్చాయి?

మానవుడు ఆరోగ్యంగా ఉండాలంటే తను నివసించే ప్రాంతలో పండించే పంటలను, పాలను ఆహారంగా తీసుకోవాలి.

  1. మన ప్రాంతంలో పండే పంట, మన వాతావరణానికి తగ్గట్టుగా పండుతుంది. మనం మన ప్రాంతంలో పండే పంటను ఆహారంగా తింటే మనం ఆరోగ్యంగా ఉంటాము, మన వాతావరణానికి తగ్గట్టుగా వ్యాధి నిరోధక శక్తి ఆ పంటలో ఉంటుంది.
  2. మన ప్రాంతం పండే పంట తినడం వలన మన ప్రాంతంలోని రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం వుంది.

Leave a Reply