ఎప్పుడూ ఏడుపే

ఎప్పుడూ మన ఆర్టీసీ యజమామ్యం ప్రైవేటు వాహనాల వలన నష్టం వస్తున్నదని పాత పాటే పాడుతుంటారు. ప్రైవేటు వాహనాల కన్నా మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయడం మీద కొంత సమయం కేటాయించాలి.

నష్టాలు ప్రైవేటు వాహననాల వల్ల కాదు, ఈ యాజమాన్యం మెదడుకు పదును పెట్టక పోవడం వలనే. ఇప్పటికే చాల పథకాలు అమలులో ఉన్నాయి. 

ఆర్టీసీ లాభాల వైపు పయనించాలంటే :

  1. మొదట ఆర్టీసీ వెబ్ సైట్ ను ఆంగ్లం నుంచి తెలుగులోకి మార్చాలి.
  2. అమలులో ఉన్న పథకాలను ఆర్టీసీ కార్మికుల ద్వారా అమ్మాలి. అమ్మిన మొత్తంలో 40% ప్రతిఫలంగా వారికి అదే రోజు ఇవ్వాలి.
  3. ప్రతిరోజు వచ్చే వసూళ్ళలో 10% ప్రతిఫలం ఆ బస్సు నడుపుతున్న సిబ్బందికి ఇవ్వాలి.
  4. రద్దీ లేని సమయాల్లో తక్కువ ధరలకే టిక్కెట్లు  అమ్మాలి. అప్పుడు బస్సు కాళీగా వెళ్ళే బదులు కొంత ఆదాయము సమకూరుతుంది.

నష్టం వస్తున్నదని కార్మికులను వత్తిడికి గురిచేయకూడదు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.