బోగి పండుగ

సంక్రాంతి పండుగ ముందు రోజు వచ్చే బోగి పండుగనాడు తెల్లవారుజామున ప్రతి ఇంటిముందు లేదా ప్రతివీధిలోనూ బోగిమంటలు వేయడం తెలుగువారి ఆచారం. ఈ మంటలలో పాత వస్తువులను, గోమయంతో చేసిన గొబ్బి పిడకలను వేస్తారు. ఈ మంటలను వేసే బాధ్యత యువకులు తీసుకుంటే, ఆ మంటలలో వీధిలోని వారందరూ సామూహికంగా నీళ్ళు కాగబెట్టుకు తెచ్చుకుని తలస్నానాలు చేస్తారు. ఒక కార్యాన్ని సామాజికంగా నిర్వహించడం వల్ల వారిలో సత్సంబంధాలు నెలకొంటాయి. ఇదీ భోగి మంటల విశిష్టత.

బోగిరోజున బోగిమంటల్లాగే సాయంత్రం చంటి పిల్లలు ఉన్నవాళ్ళు పళ్ళెంలో రేగిపళ్ళు, చిల్లర డబ్బులు, పూలరేకులు కలపి పిల్లలకు దిష్టితీసి బోగిపళ్ళు పోస్తారు. ఈ బోగిపళ్ళు పోయించుకున్న చిన్నారులు కలకాలం బోగబగ్యాలతో తులతూగుతారని మన పూర్వికుల నమ్మకం.

అలాగే భోగి పండుగ రోజున చాలామంది తమ ఇంట్లో ‘బొమ్మల కొలువు’ ను ఏర్పాటు చేస్తుంటారు.
అంచెలంచెలుగా బల్లలు ఏర్పాటు చేసి వాటిపై వివిధరకాల బొమ్మలను వుంచుతుంటారు. ఈ బొమ్మల ద్వారా మన పురాణగాధలను పిల్లలకు వివరించే అవకాశం ఉంటుంది. అందువల్లనే బోగి రోజున ఏర్పాటు చేసే బొమ్మల కొలువు పిల్లలకు మానసికపరమైన ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని అందిస్తుంది.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.