ఈ రోజు జాన్ డేవిడ్ గారి వర్థంతి

ఈ రోజు AMG ఇండియా వ్యవస్థాపకుడు డాక్టర్ జాన్ డేవిడ్ గారి 12 వ వర్థంతి.

చిలకలూరిపేటను డాక్టర్ జాన్ డేవిడ్ గారిని విడతీసి చూడలేము. డాక్టర్ జాన్ డేవిడ్ గారు లేకపోతే అసలు చిలకలూరిపేట అనేది లేదు.

చిలకలూరిపేట ప్రాంతంలో డాక్టర్ జాన్ డేవిడ్ గారి సహాయము అందని నిరుపేద వాడులేడు. ఎలాంటి ఆపద కలిగినా వెంటనే ఆదుకోవడానికి AMG సంస్థ ఉంటుంది.

డాక్టర్ జాన్ డేవిడ్ గారు లేని లోటు ఎవ్వరూ పూడ్చలేరు. లాభంకోసం అయన ఏపనీ చేయలేదు, పేద ప్రజలకు సేవ చేయడమే ప్రధాన వృత్తిగా సాగింది.

ఈ మద్య కాలములో ఈ సంస్థ ఒక స్థిరాస్థి వ్యాపార సంస్థగా, బినామీల సంస్థ గా మారిందని సేవా దృక్పదం కోల్పోయిందని, డాక్టర్ జాన్ డేవిడ్ గారు మరలా పుట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.

చిలకలూరిపేటకు త్రాగునీటి కొరత లేకుండా చేసిన ఈ దయార్ధ హృదయుడు జనవరి తొమ్మిదవతేదీ 2005 న మరణించారు. 1950 – 60 మధ్య కాలంలో చిలకలూరిపేట చుట్టుప్రక్కల గ్రామాలలో తరచుగా తిరుగుతూ క్రైస్తవ మత ప్రచారమును చేస్తుండేవారు.
జాన్ డేవిడ్ 17 అక్టోబర్ 1926 న విశాఖపట్టణం జిల్లా, నర్సిపట్టణం తాలూకా, బల్లిఘట్టం గ్రామంలో గాబ్రియేల్ , కృపమ్మ దంపతులకు జన్మించారు.చిన్న తనంలోనే తండ్రి మరణించినందున తల్లి సంరక్షణలో పెరిగి, మిలిటరీలో పనిచేశారు. 
తనకు జీవితసహచరిగా డాక్టర్. సత్యవేదమ్మ తోడుగా నిలిచారు. .


జాన్ డేవిడ్ గారు మొదట్లో ఆంగ్లభాష నుండి తెలుగులోకి విదేశీ సువార్తీకుల ప్రసంగాల్ని తర్జుమా చేసి చేసెవారు.

 1952లో A.M.G. అనే సంస్థను స్థాపించారు. కంటి వైద్యశాలలు, క్షయ వ్యాధి నివారణ కేంద్రాలు , కుష్ఠు వ్యాధి నివారణ కేంద్రాలు, వృద్ధాశ్రమాలు, అనేక విద్యాసంస్థలు స్థాపించి అందులో అనాధలకు ప్రాధాన్యత నిచ్చారు.

1979,1982,1986,1994,1998లలో అప్పటి రాష్ట్ర గవర్నర్లచే ఉత్తమ సేవాఅవార్డులు అందుకున్నారు. 1995లో రాష్ట్రపతిచే జాతీయ బాల సంక్షమ అవార్డును అందుకున్నారు. అమెరికా తానా మహాసభలోకూడా ఉత్తమ సంఘసేవా అవార్డును అందుకున్నారు. పలు పట్టణాలు , గ్రామాలలో త్రాగునీరు, మురుగు కాల్వల అభివృద్ధి, పేదల గృహనిర్మాణము వంటి సేవాకార్యక్రమాలు నిర్వహించారు. 

ఆయన సేవలు ఎంత చెప్పిన తక్కువే. 

Leave a Reply