రాయపాటి రైలు ఎక్కడ?

ఏరు దాటేదాకా ఓడ మల్లయ్య, ఏరు దాటిన తరువాత బోడి మల్లయ్య 

రాయపాటి సాంబశివరావుగారు చాల పెద్ద సీనియర్ పార్లమెంట్ సభ్యుడు, అంతే కాకుండా రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి నుంచి ఢిల్లీ దాక ఆయనకు పలుకుబడి ఉంది.

ఎన్నికల సమయంలో రాయపాటి గారు ఇచ్చిన వాగ్దానం ‘అయన ఈ సారి ఎన్నికలలో గెలిస్తే చీరాల నుంచి చిలకలూరిపేట మీదుగా నరసరావుపేటకు రైల్వే ట్రాక్ ఏపిస్తాను’ అని ప్రతి ఎన్నికల సభలోమరియు పత్రికా సమావేశాలలో వాగ్దానం చేసినారు.

ఇప్పటికి రాయపాటి గారి పదవీకాలం సగం పూర్తి అయినది. ఈ రోజు వరకు మాటవరసకు కూడా రైలు ఊసే ఎత్తలేదు.

Leave a Reply