సిగ్గుతో తలవంచిన  రియల్ఎస్టేట్ వ్యాపారం 

అరుంధతీ కనపడదు, అద్వాన్నమూ కనపడదు, అరవై వరహాల అప్పు మాత్రం కనపడుతుంది

40 శాతం పడిపోయిన స్థిరాస్తుల విలువ. నియోజకవర్గంలో స్థిరాస్తులు అమ్మకానికి వందల సంఖ్యలో ఉన్నాయి. కొనే వాడు ఒక్కడు కూడా కనిపించడంలేదు.

అవసరానికి అమ్ముకోలేక కొంత మంది బాధపడుతుంటే, పెద్ద మొత్తంలో భయానా ఇచ్చి సరయిన సమయంలో డబ్బులు అందక తగాదాలతో మరియు  పరిష్కరాలతో బాధ పడుతున్నవారు కొంత మంది.

పాత నోట్ల రద్దుకు ముందు స్థిరాస్తుల రేట్లు  పిచ్చికి పరాకాష్ట స్టాయిలో ఉండేవి. రూ 10 లక్షలలోపు ఎలాంటి ఆస్థి కూడా లభించదు.

నీతిగా బ్యాంకు చెక్కులిచ్చి ఆస్తులు కొనుక్కోవాలన్నా చెక్కులు తీసుకొనే వాళ్ళు లేరు.

Leave a Reply