అభివృద్ధి నామ సంవత్సరం

అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. 

2016 వ సంవత్సరంలో చిలకలూరిపేటలో అభివృద్ధి నిరాటంకంగా సాగి చరిత్రలో లికించ దగిన దిశగా దూసుకెళ్లిoది.

వ్యవసాయం : స్వయానా మన M L A వ్యవసాయ శాఖ మంత్రి కావడంతో మన నియోజకవర్గ రైతులకు వివిధ పథకాలలో రాయతీలు లభించాయి.

మున్సిపాలిటి: ప్రతి వార్డు లో ఎదో ఒక అభివృద్ధి కార్యక్రమం జరుగుతుండడం కనిపిస్తుంది. పట్టణంలో కూడా కొంత మేర అందంగా తీర్చి దిద్దారు.

విద్యుత్ : నియోజకవర్గంలో ఏ వైపు చూసినా     నూతనoగా ఏర్పాటు చేసిన పెద్ద విద్యుత్ స్తంబాలు కనిపిస్తుంటాయి. పట్టణం చీకటిని ఛేదించి వెలుగు వైపు పయనిస్తుంది.

పారిశుద్యం: మన పురపాలక సంగo ప్రాంగణంలో మొదటి సారి మరుగు దొడ్లు  కట్టుకున్నారు. ఇది కౌన్సిలర్ విడదల లక్ష్మీ నారాయణ పోరాట ఫలితమే. చెత్తను ప్రతి ఇంటి నుంచి సేకరించడం ఓక మంచి పరిణామo.

శాంతిభద్రతలు: నియోజకవర్గంలో ఈ సంవత్సరం శాంతి భద్రతలు చాల బాగున్నాయి. ఈ ఖ్యాతి సురేష్ కుమార్ కు దక్కుతుంది.

బైపాస్ రోడ్డు  : బైపాస్ రోడ్ కి అనుమతి మంజూరుచేసి ప్రజలను రోడ్డు  ప్రమాదాలనుంచి కాపాడారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.