అనుకోని మలుపు

మందు షాపుల విషయంలో జాతీయ మరియు రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల దూరంలో ఏర్పాటు చెయ్యాలని సుప్రీంకోర్టు  చాల మంచి నిర్ణయం తీసుకుంది.

సుప్రీo కోర్టు  తీర్పు వెలువడిన వెంటనే నియోజకవర్గంలో వున్న అన్ని బార్ షాపుల యజమానులు వాళ్ళ మెదడుకు పదును పెట్టారు.

ఈ నూతన నిబంధనల ప్రకారం చిలకలూరిపేట పట్టణంలో ఎక్కడా కూడా బార్ షాపులకు అనుమతిoచడం కుదరదు. 

కారణాలు:

  1. పట్టణం మధ్యలో కుండా జాతీయ రహదారి వెళుతుంది. దీనికి రెండు వైపులా 500 మీటర్ల వరకు కుదరదు.
  2. నరసారావుపేట నుండి పట్టణంలోకి వచ్చే రాష్ట్ర రహదారి N R T సెంటర్ నుంచి చౌత్రా సెంటర్ దాటుతూ కళామందిర్ మీదుగా చీరాల వెళుతుంది. ఈ రహదారికి రెండు వైపులా 500 మీటర్ల వరకు ఎలాంటి అనుమతులు ఇవ్వరు.

మెదడుకు మేత:

  1. కొత్త నిబంధనలతో వచ్చే బార్ షాపులు ఇక ముందు స్టాక్ పాయింట్లు  గా మారె అవకాశం ఉంది. ఎందుకంటే ఈ షాపులు ప్రధాన రహదారులకు దూరంగా ఉంటాయి కనుక కస్టమర్లను ఆకట్టు కోవడం కష్టం.
  2. ఇప్పటికే సుమారు 500 లకు పైగా బెల్టు షాపులు నియోజకవర్గంలో ఉన్నాయి. ఇకముందు ఇవి మరో 1000 కి పైగా విస్తరించే అవకాశం ఉంది.
  3. ఇక ముందు ఈ బెల్టు షాపులు జాతీయ రహదారి పొడువునా మొబైల్  షాపులుగా అవతరించే అవకాశం ఉంది.
  4. మందు ను డోర్ డెలివరీ చేసే అవకాశాల మీద కూడా సాద్య అసాధ్యాలను కూడా పరిశీలిస్తున్నారు.

Leave a Reply