దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు

నియోజకవర్గం లోని పురుషోత్తమ పట్నంలో నిరు పేద పిల్లల సంక్షేమ హాస్టల్ ఉన్నది. అక్కడి ఆ పసి పిల్లల చాలా దారుణమయిన సౌకర్యాలతో కాలం వెళ్ళ తీస్తున్నారు.

అక్కడ సమస్యలు:

  1. గత ఆరు నెలలుగా కనీసం 20 మంది చిన్న పిల్లలకు కరెంటు షాక్ కి గురి అయ్యారు. విద్యుత్ సరఫరా సరీగా లేదు.
  2. పాఠశాల రికార్డుల ప్రకారం సరాసరి రోజుకు 10 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురి అవుతున్నారు.
  3. ఇక్కడ 120 మంది పేద పిల్లలు చదువుకుంటున్నారు. సుమారు 50 మంది పిల్లలకు చర్మ వ్యాధులు సోకినాయి. ఇప్పటి వరకు ఎలాంటి వైద్య సదుపాయం కల్పించలేదు.
  4. మొత్తం నాలుగు చిన్న రూములు ఉన్నాయి. ఒక్కొక్క రూంలో 32 మంది పిల్లలు నేల మీద పనుకుంటారు. 
  5. ఈ పేద పిల్లల క్లాసు రూము నిద్ర పోయే రూము ఒక్కటే. 
  6. ఈ చలి కాలంలో కూడా ఈ పేద పిల్లలు చన్నీటి స్నానమే చెస్తునారు, అనారోగ్యానికి గురి అయిన పిల్లలకు కూడా కనీసం వేడి నీళ్ళ సౌకర్యం లేదు.
  7. ఈ పసి పిల్లలు ఫిల్టర్ చెయ్యని మునిసిపల్ నీరు లేదా బోరు ద్వారా వచ్చే నీటినే త్రాగటానికి మరియు స్నానం చేయటానికి ఉపయోగిస్తుంటారు.

ప్రభుత్వం సత్వరమే స్పందించి ఈ చిన్న పిల్లలను ఆదుకుంటారని ఆసిద్దాం.

దాతల ఎవరైనా ఈ సంక్షేమ హాస్టల ను సందర్శించి మీకు తోసిన సహాయం చేయగలరు.

Leave a Reply