పందుల కధ 

పేటలో విచ్చలవిడిగా పందులు సంచరిస్తూ  ఉంటాయి. కొన్ని దశాబ్దాల తరువాత మన అధికారులకు పందుల విషయం గుర్తుకొచ్చింది.

పట్టణంలో ఇంకా కనీసం 5000 వేలకు పైగా పందులు సంచరిస్తుంటాయి అని అంచనా. పందుల పెంపకం దారులు కూడా ఈమధ్య కాలంలో పెరిగారు.

ఈ పట్టణం లో సంచరిస్తున్న ఈ జీవాలను నిర్మూలించాలని మన అధికారులు నిర్ణయించి వాటిని పట్టుకోవడానికి మన ప్రక్క రాష్ట్రము అయిన తమిళనాడు నుంచి ప్రత్యేక బృందాలను రప్పించారు.

ఎప్పటిలాగే పందుల పెంపకం దారులనుంచి వచ్చే వత్తిడులను కూడా తట్టుకొని మన కమీషనర్ గారు  ఇప్పటివరకు 2,200 పట్టించి పట్టణానికి అందనంత దూరంలోకి పంపించేశారు.

Leave a Reply