ఓటు హక్కు

బడాయి బారెడు, పొగచుట్ట మూరెడు 

18 సంవత్సరాలు నిండిన యువత ఈ నెల 14 లోపు ఓటు హక్కు కోసం దరఖాస్తు  చేసుకోవాలి అని ప్రభుత్వం నిర్ణయించింది.

కొసమెరుపు : మన అధికారులు 11 డిసెంబర్ న రోజు వారి పనులను ఆపుకొని యడ్లపాడు మండలంలోని 18 గ్రామాలలో ప్రత్యక నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే వచ్చిన దరఖాస్తులు 108.

అంటే ఒక మండలంలో 18 సంవత్సరాల వయస్సు నిండిన వారు 108 మంది, ఇది చాల విడ్డురంగా ఉంది కదు.

విచిత్రం :

  1. డిజిటల్ ఇండియా అనే నినాదం చేసే మన రాజకీయ పెద్దలు ఈ చిన్న పనిని డిజిటల్ ఎందుకు చెయ్యరు?
  2. ప్రభుత్వo దగ్గర ఆధార్ కార్డు  డేటా ఉంది, అందులో పుట్టినరోజు తేదీ ఉంది.
  3. మన ఎలక్షన్ కమీషన్ ప్రతీ నెల 18 సంవత్సరాలు నిండినవారికి ఆటోమేటిక్ గా ఓటర్ కార్డు  వాళ్ళ ఇంటికి పంపించవచ్చుగా?
  4. 2,5 లక్షల పైన బ్యాంకులో డిపాజిట్ వారికి మాత్రం నోటీసులు ఇవ్వడానికి మాత్రం ఎలాంటి ఇబ్బంది వుండదు.
  5. కానీ 18 నిండిన వారికి ఓటరు కార్డు  ఇంటికి పంపించడానికి మాత్రం వీలు కాదు.

Leave a Reply