మైకులతో దంచుతున్న నల్ల బాబులు 

నా డబ్బులు నేను తీసుకోవడానికి గంటల తరబడి బిచ్చగాడిలాగా క్యూలో నిలబడి ఉండాలా ?

ప్రపంచంలో ఇంత దౌర్బాగ్యం ఎక్కడయినా వుందా? 

ప్రతి ప్రభుత్వ అధికారులు ‘నగదు రహిత’ సమాజం గురించి మాట్లాడడం ఒక ప్యాషన్ అయిపొయింది. ఎంత మంది ప్రభుత్వ అధికారులు రోజు నగదు రహిత లావాదేవీలు చేస్తున్నారు?

నిన్న మన ప్రభుత్వ అధికారులు ఆర్యవైశ్య కల్యాణమండపం లో పెట్టిన సమావేశo ఆర్భాటానికి ఫ్లెక్సీలు, పూలు మరియు అద్దె నగదు రహిత రూపం లో కట్టారా? లేదా అసలు డబ్బులే కట్టలేదా ?

ప్రభుత్వ అధికారులు మీటింగులు ఆపి పేద వారు అయిన రేషన్ కార్డుదారుల ఆవేదన ఆలకించండి.

Leave a Reply