పేట ప్రభుత్వ ఆసుపత్రి 

ఎప్పటి లాగే ఈ సారి కూడా ఆంద్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ కమీషనర్ పి.దుర్గాప్రసాదరావు రక్త నిధి కేంద్రం ఏర్పాటు చేస్తానని ఒక పంచ్  డైలాగ్ వేసి వెళ్లారు.
రక్త నిధి కేంద్రం కావాలని గట్టిగా నిలదీయలేని  దుస్థితిలో మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉండటం శోచనీయం.

ఆకస్మిక పరిశీలన పేరుతో వచ్చిన కమీషనర్ గారు, ఎలాంటి సదుపాయాలు లేకపోయినా పనిచేసే మన పేట ప్రభుత్వ డాక్టర్లకు విచిత్రమయిన టార్గెట్ లు ఇచ్చి వెళ్ళారు.

ఇప్పుడు నెలకు ఇక్కడ 8 కాన్పులు మాత్రమే జరుగుతున్నాయి, మీరు తప్పనిసరిగా 30 కాన్పులు చెయ్యాలి అని చెప్పారు. అలా జరగకపోతే చర్యలు తీసుకొనక తప్పదని హెచ్చరించారు.

జరగ పోయేది : ఇప్పటి వరకు పేదలకు సహాయం చేయాలనే తపన వున్న డాక్టర్లు  ఇక నుంచి ఈ సార్ ఇచ్చిన టార్గెట్ కోసం ప్రైవేట్ ఆసుపత్రి లో జరిగే కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రి లో జరిగినట్టు  చూపిస్తారు.

మన డాక్టర్లు  హాస్పిటల్ లో వున్న రోగులను వదిలి రోడ్ల మీదకు వెళ్లి ప్రచారం చెయ్యాలి.

నిజం చెప్పాలంటే, వచ్చిన రోగులకు సరయిన వైద్యం అందించి నమ్మకం కలిగిస్తే, గర్భిణులు వాళ్లే వస్తారు.

Leave a Reply