వచ్చేనెల 2న కాపు జేఏసీ సమావేశం: ముద్రగడ

డిసెంబర్‌ 2న కాకినాడలో 13 జిల్లాల కాపు జేఏసీ నాయకులంతా సమావేశం కానున్నట్లు ముద్రగడ పద్మనాభం తెలిపారు. సమావేశం అనంతరం భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. నిబంధనల పేరుతో కాపు ఉద్యమాన్ని అడ్డుకోవాలని చూడడం సరికాదని ఆయన అన్నారు. అనేకమంది పాదయాత్రలు చేస్తున్నారు.. సమావేశాలు పెడుతున్నారు.. మరీ వారికి నిబంధనలు వర్తించవా? అని ముద్రగడ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మా ఇంటి వద్ద డ్రోన్లతో నిఘా పెట్టడం సరికాదని, ఏదిఏమైనా కాపు ఉద్యమం ఆగదని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply