పత్తి మిల్లులో అగ్ని ప్రమాదం

చిలకలూరిపేట మండలంలోని బొప్పూడి పరిధిలో జాతీయ రహదారి పక్కనే ఉన్న సాయి బాలాజీ కాటన్‌ ట్రేడర్స్‌ మిల్లులో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. వృథా పత్తి నుంచి మంచి పత్తి తయారు చేసే సమయంలో యంత్రంలో రాయి పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు అక్కడ పని చేస్తున్న కార్మికులు తెలిపారు. మంటలు మిల్లు మొత్తం వ్యాపించడంతో కూలీలు బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న చిలకలూరిపేట అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కొంత పత్తితో పాటు యంత్రాలకు కూడా నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు.

Leave a Reply