పేట వాసులకు అమృత ధార

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్‌ పథకంలో పేట వాసుల దాహార్తి తీర్చేందుకు రూ.120 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా చిలకలూరిపేట పురపాలక సంఘం ఈ పథకంలో నిధులను దక్కించుకుంది.

ఈ నిధులతో నకరికల్లు మండల పరిధిలోని గుంటూరు బ్రాంచ్‌ కెనాల్‌ నుంచి చిలకలూరిపేట తాగునీటి చెరువు వరకు 39 కి.మీ. మేర పైపులైన్‌ ఏర్పాటు చేయనున్నారు.

పట్టణంలోని తూర్పుమాలపల్లి వద్ద ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌, పేదలకు గృహాలు మంజూరు చేసిన 52 ఎకరాలలో మరో ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌, నూతనంగా చెరువు ప్రాంతంలో ఫిల్టర్‌బెడ్‌, ప్రస్తుతం పండరీపురంలోని ఉన్న ఫిల్టర్‌బెడ్‌ ఆధునికీకరణ, పురపాలకసంఘ పరిధిలో శివారు ప్రాంతాలతో కలుపుకుని మొత్తం 70 కి.మీ. మేర అంతర్గత పైపులైన్‌ ఏర్పాటు చేయనున్నారు.

Leave a Reply