అందరూ ఆరోగ్యంగా ఉండేందుకే వైద్య శిబిరాలు

చిలకలూరిపేట స్వర్ణాంధ్ర ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మణిపాల్‌ ఆసుపత్రి సౌజన్యంతో ప్రత్తిపాటి గార్డెన్స్‌లో ఆదివారం 23వ ఉచిత మెకాళ్ల, కీళ్ల నొప్పుల వైద్య శిబిరం నిర్వహించారు.

ఈ నెల 23న చిలకలూరిపేటలో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తామన్నారు. 70 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని ప్రత్తిపాటి వివరించారు. నిరుద్యోగ యువతీయువకులు ఈ జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

స్వర్ణాంధ్ర ఫౌండేషన్‌ కార్యదర్శి పేర్ని వీరనారాయణ అధ్యక్షత వహించిన కార్యక్రమంలో కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ చలంశెట్టి రామానుజయ, పురపాలకసంఘ ఛైర్‌పర్సన్‌ గంజి చెంచుకుమారి, భాష్యం రామకృష్ణ, కంచర్ల శ్రీనివాసరావు, లక్ష్మీ నర్సింగ్‌ స్కూల్‌ డైరెక్టర్‌ వడ్లమూడి రవీంద్ర, ఎస్పీ నారాయణ నాయక్‌, మణిపాల్‌ ఆసుపత్రి వైద్యులు జగదీశ్‌, సురేశ్‌ తదితరులు ప్రసంగించారు.

2,500 మందికి వైద్య పరీక్షలు 
స్వర్ణాంధ్ర ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన మెగా మోకాళ్ల, కీళ్ల నొప్పుల వైద్య శిబిరంలో 2,500 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారని ఫౌండేషన్‌ కార్యదర్శి పేర్ని వీరనారాయణ తెలిపారు. వీరిలో 630 మందిని ప్రాథమిక చికిత్స కోసం ఎంపిక చేశామన్నారు. అవసరమైనవారికి సీఎం రిలీఫ్‌ఫండ్‌ ద్వారా శస్త్రచికిత్సలు చేయిస్తామన్నారు.

Leave a Reply