విజిలెన్స్‌ అదనపు ఎస్పీగా శోభామంజరి

గుంటూరు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ అదనపు ఎస్పీగా శోభామంజరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన ఎస్పీ కేవీ మోహన్‌రావు సీఐడీకి బదిలీ అయ్యారు. 1989 బ్యాచ్‌కు చెందిన శోభామంజరి విజయవాడ, ఏలూరు, పశ్చిమగోదావరిలో పనిచేశారు. 2006లో సీఐగా, 2014లో డీఎస్పీగా ఉద్యోగోన్నతి పొందారు. 2015లో అదనపు ఎస్పీగా ఉద్యోగోన్నతి కల్పించి గ్రామీణ నేర విభాగ ఏఎస్పీగా నియమించారు. ఇటీవల ఆమెను గుంటూరు విజిలెన్స్‌ అదనపు ఎస్పీగా నియమించారు. శనివారం గుంటూరులోని విజిలెన్స్‌ కార్యాలయానికి విచ్చేసిన ఆమెకు విజిలెన్స్‌ డీఎస్సీ రమణకుమార్‌, డీఈ కళ్యాణచక్రవర్తి, సూపరింటెండెంట్‌ గోపాల్‌, సీఐలు వంశీధర్‌, కిషోర్‌కుమార్‌, సిబ్బంది పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. విజిలెన్స్‌ ఏఎస్పీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏఎస్పీ శోభామంజరి మాట్లాడుతూ ఎలాంటి అక్రమాలైనా దృష్టికి వస్తే నిర్భయంగా తమ సెల్‌ నెంబర్‌ 80082 03288 కు ఫోన్‌ చేసి సమాచారం అందివ్వవచ్చన్నారు.

Leave a Reply