పండ్లను మాగబెట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా రైపనింగ్‌ ఛాంబర్లు

పండ్లను మాగబెట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్‌ యార్డుల్లో రైపనింగ్‌ ఛాంబర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. చిలకలూరిపేట మార్కెట్‌యార్డులో నూతనంగా రూ.24 లక్షలతో ఏర్పాటు చేసిన రైపనింగ్‌ ఛాంబర్‌ను బుధవారం మంత్రి ప్రారంభించారు. అక్కడే రూ.21.5 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ కార్బైడుకు ప్రత్యామ్నాయంగా ఇథిలీన్‌ ద్వారా పండ్లను మాగబెట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 16 రైపనింగ్‌ ఛాంబర్లు ఏర్పాటు చేశామన్నారు. ఇంకా అవసరమైన చోట ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మామూలుగా 20 రోజుల్లో పండే ఫలాలు దీని ద్వారా 4 రోజుల్లో పండుతాయన్నారు. తద్వారా రైతులకు సమయం కలిసిరావటంతో పాటు లాభాలుకూడా పొందవచ్చన్నారు. వీటితోపాటు అవసరమైన చోట శీతల గిడ్డంగులు, గోదాములను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. 

Leave a Reply