యడ్లపాడులో ఎన్టీఆర్‌ వైద్యసేవ మెగా వైద్యశిబిరం

నియోజకవర్గంలో రాజకీయ పనులే కాకుండా సేవా కార్యక్రమాలను చేయాలనే సత్‌సంకల్పంతోనే ఉచిత వైద్యశిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి సతీమణి ప్రత్తిపాటి వెంకటకుమారి అన్నారు. ఎన్టీఆర్‌ వైద్యసేవ, ఎన్టీఆర్‌ మోమోరియల్‌ ట్రస్ట్‌, కాటూరి మెడికల్‌ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. స్థానిక లూథరన్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించి ఆమె ప్రసంగించారు. కంటి, గుండె, ఎముకలు ఇతర వ్యాధులకు సంబంధించిన అనేక ఉచిత వైద్య శిబిరాలను నియోజకవర్గంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నేతృత్వంలో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. శస్త్రచికిత్సలకు 118 మందికి ఎంపిక చేసినట్లు కాటూరి మెడికల్‌ ఆసుపత్రి కోఆర్డినేటర్‌ రమేష్‌ తెలిపారు.

Leave a Reply