రేపు చిలకలూరిపేటకు ముఖ్యమంత్రి

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఈ నెల 18న పర్యటనకు రానున్న నేపథ్యంలో చిలకలూరిపేట పట్టణం ముస్తాబవుతోంది. సుమారు రూ.450 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం చేయనున్నారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఈ పర్యటనను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పనులను పర్యవేక్షిస్తున్నారు. రూ.450 కోట్ల అభివృద్ధి ప నులకు సంబంధించి పైలాన్‌ల నిర్మాణం, డివైడర్ల సుందరీకరణ పనులను చేపట్టారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి మంగళవారం మంత్రి పుల్లారావు తన స్వగృహంలో అధికారులు, పార్టీ నాయకులతో సమీక్షించారు. ఈ పర్యటనను విజయవం తం చేసేందుకు అందరు స మష్టిగా కృషి చేయాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రదేశాలను అధికారులతో కలసి ఆయన పరిశీలించారు.

Huge flexis put up by Vidadala Lakshmi Naryana and Vidadala Gopi in Chilakaluripet Chief Minister N. Chandrababu Naidu, Minister Prathipati Pulla Rao and Nara Lokesh Babu17-feb-2016-50

ముఖ్యమంత్రి పర్యటన ఇలా
గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి హెలికాఫ్టర్‌లో పురుషోత్తమపట్నంలో ఏర్పా టు చేసిన హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన పురుషోత్తమపట్నం అడ్డరోడ్డు సెంటర్‌కు చేరుకుని స్వచ్ఛభారత్‌ పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. శారదా హైస్కూలు పక్కన సుమారు రూ.50 లక్షల మున్సిపల్‌ నిధులతో అభివృద్ధి చేసిన హిందూ, ముస్లిం శ్మశానవాటికను ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఫైర్‌స్టేషన్‌ రోడ్డులో రూ.2 కోట్లతో నిర్మించిన నూతన పోలీ్‌సస్టేషన్‌ను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి నేరుగా ఎన్‌ఆర్‌టీ సెంటర్‌లో ఆకర్షణీయంగా నిర్మించిన రూ.142 కోట్ల అమృత్‌ పథకం పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అక్కడ నుంచి నరసరావుపేట రహదారి లో సాగర్‌ కెనాల్స్‌ స్థలంలో రూ.250 కోట్లతో 52 ఎకరాలలో నిర్మించనున్న అందరికీ ఇళ్లు, పలు అభివృద్ధి పథకాల పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం పాత పశువుల సంత ప్రాంగణంలో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు, వెంకయ్యనాయుడు ప్రసంగిస్తారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.