అంత్యక్రియలు గౌరవప్రదంగా జరగాలి: సీఎం

అన్ని కులమతాల సంప్రదాయాలను గౌరవిస్తూ చనిపోయినవారికి గౌరవప్రదంగా అంత్యక్రియలు చేయాలనే ఉద్దేశంతో శ్మశానాలను అభివృద్ధి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. చిలకలూరిపేట పురపాలకసంఘ పరిధిలోని శారదా స్కూలు వద్ద అభివృద్ధి చేసిన శ్మశానాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. హిందూ, క్రైస్తవ, ముస్లిం శ్మశానాలన్నింటినీ అభివృద్ధి చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. శ్మశానంలోపల జరిగిన పనులను పరిశీలించి ముఖ్యమంత్రి ప్రహరీ చుట్టూ ఎత్తైన పచ్చని మొక్కలను పెంచాలని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు సూచించారు. వారి వెంట రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి నారాయణ ఉన్నారు.

Leave a Reply