నేటి నుంచి బొప్పూడిలో జాతీయ స్థాయి నాటికల పోటీలు

పోటీలను ప్రారంభించనున్న సభాపతి కోడెల దివంగత ముఖ్యమంత్రి ఎన్టీరామారావు స్మృత్యర్థం చిలకలూరిపేట మండలం బొప్పూడి లోని శాంతినికేతన్‌ కళాపరిషత్‌ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి 14వ తేదీ వరకు మూడు రోజులపాటు జాతీయస్థాయి నాటికల పోటీలు నిర్వహిస్తున్నట్లు పరిషత్‌ అధ్యక్షుడు ఆరెకట్ల శివరాం తెలిపారు. ప్రతి రోజు రాత్రి 7 గంటలకు నాటికలు ప్రారంభం అవుతాయని, తొలిరోజు పోటీలను రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ప్రారంభిస్తారని తెలిపారు. తొలిరోజు కరీంనగర్‌ వారి ‘దొంగలు’ నాటిక, చిలకలూరిపేట అంజనా రాధోడ్‌ థియేటర్స్‌ వారి ‘ సప్తపది’, ఉషోదయ కళానికేతన్‌ హైదరాబాదు వారి ‘మరో దేవాలయం’ నాటిక ప్రదర్శిస్తారు. 13వ తేది ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరిసాంబశివరావుపోటీలను ప్రారంభిస్తారు. ఆ రోజు చైతన్య స్రవంతి విశాఖపట్నం వారి కాశీ:వాశీ: రామయ్యా, సాగరి చిలకలూరిపేట వారి నల్ల సముద్రం, గంగ్రోతి- పెదకాకాని వారి ‘ సరికొత్త మనుషులు’ , మురళీ కళానిలయం- హైదరాబాదు ‘ఓర్నీ! ఆదా విషయం’ ప్రదర్శిస్తారన్నారు. 14వ తేదీ పోటీల ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొంటారని, ఆరోజు పండు క్రియేషన్స్‌ కొప్పోలు వారి ‘ నిర్ణయం’ , లిఖితసాయి శ్రీ క్రియేషన్స్‌ – గోవాడవారి ‘ పంపకాలు’, కళాంజలి ప్రగతినగర్‌ హైదరాబాదు వారి ‘ ఇల్లాలి ముచ్చట్లు’ నాటికలు పోటీలు ప్రదర్శించనున్నట్లు, పోటీలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని శివరాం తెలిపారు.

Leave a Reply