రక్తదానం ప్రాణదానంతో సమానం

పేటలో యంగ్‌ ఇండియన్స్‌ మెగా రక్తదాన శిబిరం

యంగ్‌ ఇండియన్స్‌ సర్వీస్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం కోమలవిలాస్‌ సెంటర్‌లో మెగా రక్తదాన శిబిరం జరిగింది. పురపాలకసంఘ ఛైర్‌పర్సన్‌ గంజి చెంచుకుమారి ప్రసంగిస్తూ గత అయిదు సంవత్సరాల నుంచి క్రమంతప్పకుండా రక్తదాన శిబిరాలు నిర్వహించడం సంతోషదాయకమన్నారు. ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరారు. అనంతరం పలువురు యువకులు రక్తదానం చేశారు. శిఖాకొల్లి శ్రీనివాసగుప్తా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పురపాలకసంఘ ఉపాధ్యక్షుడు బదరీనారాయణమూర్తి, లయన్స్‌ విజన్‌ బ్లడ్‌ బ్యాంక్‌ సిబ్బంది పి.రాజా, సంస్థ అధ్యక్షులు సిల్వర్‌ హరి, నరేష్‌, చంద్ర, సాయి, దుర్గా, వినయ్‌, మణి, సుమంత్‌, సుబ్బు, అఖిల్‌, అజయ్‌, విష్ణు, జగన్‌, కార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply