కరాటేతో విద్యార్థుల్లో మానస్థిక స్థైర్యం

పేటలో తెలుగు రాష్ట్రస్థాయి కరాటే పోటీలు  కరాటేతో మానస్థిక స్థైర్యం పెరుగుతుందని సాదినేని చౌదరయ్య డైరెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. స్థానిక చౌదరయ్య పాఠశాలలో ఆదివారం రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి కరాటే పోటీల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు చదువుతోపాటు కరాటే శిక్షణ ఎంతో అవసరమని తెలిపారు. విద్యార్థులు ఎదుగుదలకు, శారీర ధారుడ్యానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుందని తెలిపారు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పోటీలు నిర్వహించి విద్యార్థులకు కరాటే పట్ల ఆసక్తిని పెంచుతున్న నిర్వాహకులను అభినందించారు.

150 విద్యార్థులు హాజరు  షుటోఖాన్‌ ఇండియన్‌ కరాటే డూ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే పోటీలలో నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, కర్నూలు, తూర్పు గోదావరి, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి 150 మంది విద్యార్థులు విచ్చేశారు. కటా, టీమ్‌కటా, స్పారింగ్‌ తదితర విభాగాలలో జరిగిన పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ ఏపీ రాష్ట్ర కన్వీనర్‌ రాజు, ఇనస్ట్రక్టర్‌లు రవి, బాలు, టి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply