పట్నం వాసులకు ఆ ప్రశ్న అడిగే సత్తా ఉండాలి

Article Written by Rama Krishna :

పట్నం వాసులకు ఆ ప్రశ్న అడిగే సత్తా ఉండాలి : శివరాత్రి తిరునాళ్ల అంటే పురుషోత్తమపట్నం…పురుషోత్తమపట్నం అంటే శివరాత్రి తిరునాళ్ల.వందల సంవత్సరాల నుండి త్రికోటేశ్వరునికి కోట్లాది రూపాయలు వెచ్చించి భక్తి ప్రపత్తులతో ప్రభలు కడుతుంటే పాలకులు మాత్రం మనకి తీరని అన్యాయం చేస్తున్నారు.పదుల సంఖ్య లో కొన్ని కుటుంబాలు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ప్రభలు నిర్మిస్తుంటే అటువంటి వారికి కనీసం వీఐపీ దర్శనం కల్పించలేని దుస్థితి ఉంది.కోటప్పకొండకు వచ్చే ప్రభాలలో 40% షేర్ మనదే.కాని తిరునాళ్ల రోజున ఎమ్మెల్యే లు అని,ఎంపీ లు అని,గవర్నర్ లు అని,మినిస్టర్ లు అని,జడ్జీ లని …ఇలా ఎంతో మంది వీఐపీ లు వచ్చి మనకు స్వామి వారి దర్శన భాగ్యం కరవు చేస్తున్నారు.దీన్ని మీరంతా ప్రశ్నించాలి.

అసలు మనం ప్రబలే నిర్మించకపోతే ఇలాంటి వీఐపీ లు వస్తారా…తిరునాళ్ల అంత గొప్పగా ఉంటుందా. .పోలీస్ లు మనపై ఆంక్షలు విధించగలరా…కొండపైకి వెళ్తే మనల్ని తోసి వేయగలరా..లక్షలు ఖర్చు పెట్టేది మనం…వీఐపీల పేరిట ప్రత్యేక దర్శనం,అభిషేక పూజలు ఇలా ఎన్నో వైభోగాలు అనుభవిస్తున్నారు.ఒక ప్రభ నిర్మించాలంటే మన అమ్మనాన్నలు,అక్కాచెల్లెళ్లు,అన్నదమ్ములు,బావబామ్మర్దులు,వదినామరదళ్ళు,అమ్మమ్మనానమ్మలు,తాతయ్యలు,అత్తమామలు…ఇలా ఎంతో మంది భాగస్వామ్యం ఉంటుంది.అలాంటి వారంతా మనస్పూర్తిగా,సౌకర్య వంతంగా స్వామి వారిని దర్శించుకోలేకపోతున్నారు.

ఎంతో మందికి అన్నాలు, కూరలు వండి మన ప్రభల దగ్గరకు చేర్చే మన ఇంటి ఆడవాళ్ళు కూడా కొండకు చేరాక కనీసం స్వామి వారిని దర్శించుకోలేని దుస్థితి నెలకొంది.అందుకే మన కష్టం మీద,మన శ్రమ మీద ఆధారపడిన కొండ తిరునాళ్ల లో మనకు అన్యాయం జరగకూడదంటే మనం ప్రశ్నించాలి.

  1. ప్రభ నిర్వహణలో పూర్తి స్థాయి భాగస్వామ్యం అయ్యే కుటుంబాలను ప్రభుత్వం ప్రత్యేక వీఐపీలుగా పరిగణించాలి.
  2. ప్రతీ సాధారణ ప్రభ తయారు చేసే 20 కుటుంబాలకి,మధ్యస్థ లైటింగ్ ప్రభలు నిర్వహించే 40 కుటుంబాలకి,ఎలక్ట్రికల్ ప్రభలు నిర్వహించే 60 కుటుంబాలకు ఆర్టీసీ ఉచిత సౌకర్యం కల్పించాలి.
  3. తిరునాళ్ల జరిగే ఉదయం నుండి మరుసటి రోజు ఉదయం వరకు ఒక్కో ప్రభ దగ్గర ఒక్కో ఆర్టీసీ బస్సు ని ఉంచాలి.ప్రభలు నిర్వహించే కుటుంబీకులను కొండ పైకి తీసుకెళ్లి ప్రత్యెక దర్శనం కల్పించి తిరిగి ఇంటి వద్ద వదిలి పెట్టాలి.100 రూపాయలు ఇస్తే చాలు అనామకులకు సైతం ప్రత్యేక దర్శనం కల్పించే ప్రభుత్వాలు…దాదాపు 2 కోట్లు పైగా వెచ్చించి తిరుణాళ్ళకే శోభ తెచ్చే మన ప్రభల నిర్వాహకులకి ప్రభుత్వం ఈ మాత్రం సాయం కూడా చేయరా????

మీరు నిలదీయండి.పాలకులు కదిలొస్తారు.చచ్చినట్లు దిగి వస్తారు.

Leave a Reply