సామాజిక సేవలో అందరూ భాగస్వాములు కావాలి

రెడ్‌క్రాస్‌ భవనం ప్రారంభించిన మంత్రి ప్రత్తిపాటి
సామాజిక సేవలో అందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. చిలకలూరిపేట తహశీల్దారు కార్యాలయ ఆవరణలో దాత జంపని భాస్కరరావు రూ.6 లక్షలతో నిర్మించిన నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. పట్టణంలో రక్త నిల్వ కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. శాసనమండలి సభ్యుడు ఏఎస్‌ రామకృష్ణ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా రెడ్‌క్రాస్‌ అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని, సంస్థ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న రక్తనిల్వ కేంద్రాలు ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్నాయని కొనియాడారు. జిల్లా పరిపాలనాధికారి కాంతిలాల్‌దండే మాట్లాడుతూ సామాజిక విప్లవానికి నాంది పలికి సమాజంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు రెడ్‌క్రాస్‌ కృషి చేస్తోందన్నారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ జానీమూన్‌ మాట్లాడుతూ ఆపదలో ఉన్న ఎన్నో ప్రాణాలను రక్త దానం చేసి కాపాడే గొప్ప సంస్థ రెడ్‌క్రాస్‌ అంటూ కొనియాడారు. ఈ సందర్భంగా రెడ్‌క్రాస్‌ కమిటీ సభ్యులను సత్కరించారు. కార్యక్రమంలో యార్డు ఛైర్మన్‌ నెల్లూరి సదాశివరావు, ఎంపీపీ యలగాల సాంబయ్య, తహశీల్దారు పీసీహెచ్‌ వెంకయ్య, ఇన్నర్‌వీల్‌ క్లబ్‌ అధ్యక్షురాలు పఠాన్‌ సర్తాజ్‌, తెదేపా నేతలు కరిముల్లా, రెహమాన్‌, బ్రహ్మస్వాములు, సోంబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply