న్యాయబద్దంగా సమస్యలుంటే అధికారులను ప్రశ్నించండి : మంత్రి ప్రత్తిపాటి

తెదేపా ప్రభుత్వం 18 నెలల్లో ఎన్నో ప్రజా ఉపయోగకరమైన పనులు చేపట్టిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. స్థానిక 18 వార్డులో బుధవారం జన్మభూమి-మా వూరు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ప్రత్తిపాటి మాట్లాడుతూ జన్మభూమి కార్యక్రమం ద్వారా అధికారులు, కమిటీ సభ్యులు వార్డుల్లోకి వస్తున్నారని సమస్యలు ఉంటే తెలియజేయాలన్నారు. న్యాయబద్దంగా సమస్యలు ఏమైనా ఉంటే అధికారులను ప్రశ్నించవచ్చన్నారు. మార్చి నెలలో మంచినీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. వేసవిలో మంచి నీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. వివిధ కార్పొరేషన్‌ల ద్వారా సబ్సిడీపై రుణాలు అందించం, డ్వాక్రా, చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేస్తున్న ఘనత చంద్రబాబుదేనని వివరించారు. ఇప్పటికే నియోజకవర్గంలో రూ.460కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామన్నామని ఈ నెలాఖరులో మరో రూ.300 కోట్లతో పట్టణంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపనలు చేస్తారని వివరించారు.

Leave a Reply