లింగారావుపాలెంలో ఉచిత వైద్య శిబిరం

మండలంలోని లింగారావుపాలెంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన విజన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో వైద్యులు జి.శివన్నారాయణ, కె.శ్రీజ్యోతి పాల్గొన్నారు. 140 మంది రోగులకు రక్తపోటు, మధుమేహం తదితర పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నిర్వాహకులు మాట్లాడుతూ రెండు నెలలకోసారి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పేదలకు, వృద్ధులకు ఆరోగ్య సమస్యలు లేకుండా చేసేందుకే ఫౌండేషన్‌ ఏర్పాటు చేశామన్నారు. నిరుపేదలందరూ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్థానిక వెంకటేశ్వర కల్యాణ మంటపంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు పాల్గొని సహకారం అందించారు.

Leave a Reply