విన్సెంట్‌ పాల్‌ సేవలు అభినందనీయం

పలు రంగాల్లో తనదైన శైలిలో సేవలు అందిస్తున్న విన్సెంట్‌ పాల్‌ ఆదర్శనీయుడని లయన్స్‌ క్లబ్‌ పట్టణ అధ్యక్షుడు పోలిశెట్టి వెంకటరామారావు అన్నారు. ఇటీవల అడవి తక్కెళ్లపాడులో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సామాజిక సేవా పురస్కారం అందుకున్న విన్సెంట్‌పాల్‌కు ఆదివారం టెక్స్‌టైల్‌ భవనంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెంకటరామారావు మాట్లాడుతూ లయన్స్‌క్లబ్‌ సభ్యునిగా, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ, రైజ్‌ సర్వీసింగ్‌ సంస్థ డైరెక్టర్‌గా, రంగస్థల నటుడుగా పాల్‌ అనేక సేవలు చేశారన్నారు. అనంతరం క్లబ్‌ సభ్యులు శాలువాలు, పూలదండలతో ఆయన్ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో క్లబ్‌ కార్యదర్శి ఎస్‌ఎం ఉమర్‌, కోశాధికారి కొప్పురావూరి వెంకటేశ్వరరావు, డాక్టర్‌ ఏవీఎస్‌ సురేష్‌కుమార్‌, ఉప్పుటూరి ప్రభాకర్‌, పోలిశెట్టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.