అభివృద్ధి చేస్తే ఆధ్యాత్మిక ప్రతీకే

బొప్పూడి కొండపై పర్యాటకానికి విజ్ఞప్తి 
ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన ధర్మకర్త

చారిత్రక ప్రసిద్ధి గాంచిన బొప్పూడి కొండపై వెలసిన వేంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా రూపుదిద్దేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. చిలకలూరిపేట మండలంలోని బొప్పూడి కొండపై ఆరో శతాబ్దంలో వెలసిన స్వయంబు వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రధానంగా చెన్నై- కోల్‌కటా 16వ నెంబరు జాతీయ రహదారికి అతి సమీపంగా బొప్పూడి కొండ ఉండటంతో భవిష్యత్తులో పర్యాటకుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆలయ ధర్మకర్తగా బాధ్యతలు తీసుకున్న గ్రామానికి చెందిన ఐపీఎస్‌ అధికారి, పశ్చిమబంగా రాష్ట్ర అదనపు డీజీపీ డాక్టర్‌ బొప్పూడి నాగ రమేష్‌ ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి అందించారు.

దీనిలో భాగంగా మoదుగా గ్రామ సర్వే నెంబరు 314, 513లోని 115 ఎకరాలలో ఉన్న అన్ని మైనింగ్‌ లీజులను రూలు 11 ఏపీఎంఎంసీ రూల్స్‌ 1960 ప్రకారం రద్దు చేయాల్సిందిగా కోరారు. దీంతో పాటు దేవాలయ అభివృద్ధిలో భాగంగా నీటి సంపు, పంపుహౌస్‌, వాటర్‌ ట్యాంక్‌ నిర్మించడంతో పాటు ప్రస్తుత దేవాలయాన్ని పునః నిర్మాణం చేసి ప్రాకారాలు, గాలిగోపురం, మాడవీధుల అభివృద్ధి, శంకు చక్రాలు, నామాలు, కల్యాణ మండపం, అన్నదాన సముదాయం, వాహనాలకు పార్కింగ్‌ సదుపాయం, బీబీ నాంచారమ్మ దేవాలయం, ఉద్యానవనం, 50 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం, పుష్కరిని ఏర్పాటు చేసేందుకు 110 ఎకరాలను దేవాలయానికి కేటాయించాలని ప్రభుత్వానికి సూచించారు.

Leave a Reply