Prathipati Pulla Rao To Inaugurate Development Works In Purushothama Patnam

18-aug-2016

2019 నాటికీ కానీవినీ ఎరుగని అభివృద్ధి : మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

2019 నాటికీ పట్టణంలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి పనులు చాసి చూపిస్తానని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిలకలూరిపేట  నియోజకవర్గ సమగ్ర అభివృద్దే తన ధ్యేయమని అన్నారు. తనకు మంత్రి పదవి రావడం నియోజకవర్గానికి వచ్చిన గౌరవంగా భావిస్తానన్నారు. ఇచ్చిన హామీలను చిత్తశుద్దితో నెరవేర్చడం  తన బాద్యతన్నారు. వార్డుల్లో, గ్రామాలలో ఏ  సమస్య ఉన్నాస్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకరావాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆకాంక్షకు అనుగుణంగా ప్రతి తెలుగుదేశం కార్యకర్త ప్రభుత్వ అనుసంధానకర్తగా పనిచేయాలన్నారు. నియోజకవర్గంలో కోట్లాదిరూపాయల అభివృద్ధి ప్రజలకు తెలియచేయాలన్నారు. 26వవార్డులో రూ12.02లక్షలు పనులకు శంకుస్థాపన చేసారు. ముందుగా మంత్రికి కౌన్సిలర్ విడదల లక్ష్మినారాయణ మేళతాళాలతో ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ గంజి చెంచు కుమారి మరియు తోట బ్రహ్మస్వాములు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply