Janmabhumi-Maa Vooru programme

07-june-2016

సమావేశంలో మాట్లాడుతున్న కమీషనర్ కనకారావు
 
పచ్చదనమే భావితరాలకు మూలధనమని మునిసిపల్ కమీషనర్ ఏన్ కానకారావు పార్కొన్నారు.
 
జన్మభూమి – మా వూరు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గ్రామసభలో పట్టణ పరిదిలోని 7 వార్డులలో శనివారం నిర్వహించారు.  24, 26, వార్డులలో నిర్వహించిన సభా కార్యక్రమంలో ఆయన మునిసిపల్ చైర్ పర్సన్ గంజి చెంచు కుమారితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ పట్టణ ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందిచాలన్న లక్షంతోనే పనిచేస్తున్నామన్నారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేoదుకు ముఖ్యమంత్రి శ్రమిస్తున్నా అధికారులు ఆ దిశగా చొరవచూపడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. పట్టణ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేoదుకు రూ.142 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించడం జరిగిందన్నారు.    స్వచ్ఛభారత్, ఆత్మగౌరవ్ పధకం కింద మరుగుదొడ్ల నిర్మాణం ఫై ప్రజలను చైతన్యవంతం  చేయాల్సిదిగా ఆమె అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 26వ వార్డు కౌన్సిలర్ విడదల లక్ష్మినారాయణ టి డి పి నాయకులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
Purushothama Patnam Municipal Councilor Shri.Vidadala Lakshmi Narayana conducted Janmabhumi-Maa Vooru programme together with chilakaluri pet municipal commissioner and Chairperson.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.