మేనిఫెస్టోలో సగం హామీలు అమలు : మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

25-may-2015

రూ.8కోట్లతో R&B రహదారుల మరమ్మతులకు శంకుస్థాపన

అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరం లోపే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు సగంమేర నెరవేర్చిన ఘనత టి డి పి ప్రభుత్వానికి దక్కిందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. రూ.8కోట్లతో నియోజకవర్గం లోని పలు R&B రహదారుల అభివృద్ధికి మంత్రి ఆదివారం రాత్రి శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా పురుషోత్తమపట్నం వద్ద జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ సంవత్సర సమయం లోపల ప్రతి ఇంటికి ఒక లబ్ది చేకూరిoదన్నారు.

రూ.1.77 కోట్లతో చిలకలూరిపేట-కోటప్పకొండ-నరసరావుపేట  (1/1 కి.మీ నుంచి 10/0 కి.మీ వరుకు ) రహదారి శంకుస్థాపన నిర్వహించారు. మూడు నాలుగు నెలలు లోపల ఆయా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశిచారు. నియోజకవర్గంలో ప్రతి రహదారిని అభివృద్ధి చేయడమే తన లక్షమన్నారు. ఆయా కార్యక్రమమలో మునిసిపల్ చైర్ పర్సన్ గంజి చెంచు కుమారి, విడదల లక్ష్మినారాయణ పట్టణ పార్టీ అద్యక్ష కార్యదర్శులు అబ్దుల్ రహమాన్, తోట బ్రహ్మస్వాములు, ఆయా గ్రామాలకు చెందిన నాయకులు, సర్పంచులు, MPTC లు  పాల్గొన్నారు.

 

Leave a Reply