10. పురపాలకులు

పురపాలకులు

1968 సం|| లో తొలి మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పటి నుండి ఈ గ్రామమునకు చెందిన ప్రముఖులు మున్సిపల్ కౌన్సిలర్లుగా ప్రజాసేవకు తమ జీవితాన్ని అంకితం చేసినారు.

శ్రీ తోట భరతుడు, శ్రీ గోవిందు దాసయ్య, శ్రీ మతి బైరా లక్ష్మీ శివసాగర్, శ్రీ బత్తినేని శ్రీనివాసరావు, శ్రీమతి తోట చక్రవర్థిని, శ్రీ మతి బత్తినేని లక్ష్మీ దేవి, శ్రీ గుమ్మా సోమయ్య, షేక్ అబ్దుల్లా, షేక్ మౌలాలీ, శ్రీ షేక్ ( బూట్లు ) బడేమియా, షేక్ పీర్ అహ్మద్, శ్రీ షేక్ సుల్తాన్ మియా, శ్రీ షేక్ గాలిబ్ షా, శ్రీ షేక్ అల్లీమియా ( ఎక్స్ అఫిషియో మెంబర్) లు మున్సిపల్ కౌన్సిలర్ లు గా భాద్యతలను మోసినారు. వీరిలో శ్రీ బత్తినేని శ్రీనివాసరావు ప్రతిపక్షనాయకుడు హోదాను అనుభవించినారు. 2014 మార్చి 30న జరిగిన మున్సిపల్ ఎన్నికలలో శ్రీ విడదల లక్ష్మీనారాయణ గారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి దాదాపు 864పై చిలుకుఓట్ల ఆధిక్యతతో 26వ వార్డు కౌన్సిలర్ గా గెలుపొంది ఒక ప్రత్యేకతను చాటినారు.

మరియు 27వ వార్డు కౌన్సిలర్ గా శ్రీమతి షేక్ మైమూన్ గారు దాదాపు 564 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందిన తొలి మహిళా కౌన్సిలర్ గా గుర్తింపు పొందినారు.