1932లో గ్రామ పంచాయితీలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పట్లో 60 గ్రామాలు కలిపి ఒక సమితిని ఏర్పాటు చేసింది. ఆ సమితికి సమితి అధ్యక్షులుగా ఎన్నికల ద్వారా నియమించారు.
నాదెళ్ల, చిలకలూరిపేట, యడ్లపాడు మండలాల్లో అన్ని గ్రామాలు కలిపి నాదెళ్ల సమితిగా ఏర్పాటు చేశారు. ప్రభుత్వం 1987లో సమితీలు రద్దు చేసి మండల పరిషత్ లు ఏర్పాటు చేశారు. నాదెళ్ల మండల పరిషత్ పరిధిలోని మూడు మేజర్ పంచాయితీలు, 12 మైనర్ పంచాయితీలున్నాయి. 15 గ్రామ పంచాయితీల్లో 5 శివారు గ్రామాలతో కలుపుకొని మొత్తం 20 గ్రామాలున్నాయి.
దీని ప్రారంభంలో 14 MPTC లను ఏర్పాటు చేయగా, జనాభా పెరుగుదల ప్రాతిపదికన 20 MPTC లు ఏర్పడ్డాయి. మేజర్ పంచాయితీ సాతులూరు 2 MPTC లు కేటాయించగా, తూబాడు, చిరుమామిళ్ల, సంకురాత్రిపాడు, గిరిజవోలు, చందవరం, కనపర్రు, ఎండుగంపాలెం, అప్పాపురం, ఇర్లపాడులకు ఒక్కొక్క MPTC లు వున్నాయి.
1987 లో మొట్టమొదటిసారిగా మండల పరిషత్ కు జరిగిన ఎన్నికలలో మొట్టమొదటి MPP గా సాతులూరు గ్రామానికి చెందిన ఈదర వెంకటేశ్వర్లు గారు గెలుపొందారు.
రెండవ సారి జరిగిన ఎన్నికలలో రిజర్వేషన్ ద్వారా ST మహిళకు కేటాయించగా ఎండుగుంపాలెం గ్రామానికి చెందిన కొమ్మూరి గ్రేసమ్మ గారు MPP గా ఎన్నికయ్యారు.
మూడవ సారి జరిగిన ఎన్నికలలో BC మహిళకు కేటాయించగా, గణపవరం గ్రామానికి చెందిన నెల్లూరి సీతమ్మ గారు MPP గా గెలుపొందారు.
2006 లో జరిగిన ఎన్నికలలో OC జనరల్ కు కేటాయించగా, గిరిజవోలు గ్రామానికి చెందిన కంజుల వీరారెడ్డి గారు మండల అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.
2014లో జరిగిన ఎన్నికలలో OC మహిళకు కేటాయించగా గణపవరం గ్రామానికి చెందిన కాటా సాయిలక్ష్మి గారు MPP గా గెలుపొందారు.
2020లో జరిగిన ఎన్నికలలో OC జనరల్ కు కేటాయించారు.